గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు ఆగడాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి. చంద్రబాబు అండతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. తాజాగా గుంటూరులో ప్రతిపక్ష వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ముస్తఫాపై గుంటూరు అడిషనల్ ఎస్పీ వైటీనాయుడు దురుసుగా ప్రవర్తించారు. మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ముస్తఫాను అడిషనల్ ఎస్పీ బయటకు నెట్టేశారు. ప్రజాప్రతినిధి అనే గౌరవం కూడా లేకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేపై తన ఓవరాక్షన్ ప్రదర్శించాడు. పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడటానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. <br/>