చంద్రబాబు పాలనలో దళిత క్రైస్తవులకు తీవ్ర అన్యాయం..

దళిత క్రైస్తవ ఆస్తులను దోచుకుంటున్నారు..
వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీసెల్‌ అధ్యక్షుడు  మేరుగ నాగార్జున 
విజయవాడః ఏపీలో దళిత క్రైస్తవుల ఆస్తులను చంద్రబాబు ప్రభుత్వం దోచుకుంటుందని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత క్రైస్తవులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎంతవరుకు నెరవేర్చరో చంద్రబాబు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.  ప్రతి జిల్లాకు క్రైస్తవ కమ్యూనిటీ హాలు కేటాయిస్తామని చెప్పి నాలుగున్నరేళ్లు అయ్యిందని ఒక పునాది ఇటుకయిన పడిందా అని ప్రశ్నించారు. విదేశాల నుంచి దానం చేసిన క్రైస్తవ ఆస్తులను చంద్రబాబు అండ్‌ కో దోచేస్తుందని దుయ్యబట్టారు.  దళితులు మరణిస్తే పూడ్చుకోవడానికి స్థలం కూడా లేదని, స్మశ్మానంలో కూడా దళిత క్రైస్తవులకు   భూములు కేటాయించడం లేదన్నారు. దళిత క్రైస్తవ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు  అధికారం కోసం ఏ గడ్డి అయినా తింటాడన్నారు. దళితులకు నిలువ నీడ కూడా చేస్తుందని చంద్రబాబు పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. దళితుల సంక్షేమం ఊసేత్తని చంద్రబాబుకు ఎన్నికల సమయంలో  గుర్తు వస్తున్నారని దుయ్యబట్టారు. ఓటు రాజకీయాల కోసం అంబేద్కర్‌ ఆలోచన విధానంలో పనిచేసిన మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుటుంబంపై చంద్రబాబు అవ్వాకులు చవ్వాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు.  క్రైస్తవ మనోభావాలు దెబ్బతినే విధంగా చంద్రబాబు పాలన ఉందన్నారు. అవసరం లేకపోతే అవసరం ఎడమకాలుతో తాన్నే రకం చంద్రబాబు అని తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సీకాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవరన్నారు. అధ్వాన్న డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్‌ సమస్యలతో దళితులు తీవ్ర ఇబ్బందుడు పడుతున్నారన్నారు. హిందువుగా పుట్టిన  చంద్రబాబు హిందూ ఆస్తులను కూడా పరిరక్షించడం లేదన్నారు. చంద్రబాబు హయాంలో హిందువుల ఆస్తులకు రక్షణలేకుండా పోయిందన్నారు. సదావర్తి ఆస్తులను చంద్రబాబు అప్పనంగా అమ్ముకున్నారని దుయ్యబట్టారు. హిందువుల మనోభావాలను కూడా దెబ్బతీస్తున్నారన్నారు. దళిత క్రైస్తవులకు హామీలు మేనిఫెస్టోలో ఉన్న ఒకటి కూడా అమలు చేయలేదన్నారు.  26 మంది కేబినెట్‌ మినిస్టర్లలో  ఒక దళిత క్రైస్తవుడు కూడా లేరన్నారు. ఓట్ల కోసం దళిత క్రైస్తవులను మభ్యపెట్టే చేస్తున్నావని విమర్శించారు.

Back to Top