చంద్రబాబు పదేళ్ల జైలు శిక్ష తప్పదు



– ఓటుకు కోట్లు కేసులో బాబే కుట్రదారు
– టీడీపీ నేతలు చట్టానికి ఏమైనా  అతీతులా?
హైదరాబాద్‌: ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష తప్పదని వైయస్‌ఆర్‌సీపీ మైనారిటీ నాయకుడు మహ్మద్‌ ఇక్బాల్‌ వ్యాఖ్యానించారు. ఈ కేసులో చంద్రబాబుకు సంబంధించిన ఆడియో, వీడియో టేపులతో సహా అన్ని సాక్షాదారాలు ఉన్నా ఆయన్ను ఎందుకు కోర్టుకు పిలవడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇక్బాల్‌ మీడియాతో మాట్లాడారు.  ఓటుకు కోట్లు కేసు విచారణ ప్రారంభం కాగానే టీడీపీ నేతల్లో దడ పుట్టుకుందన్నారు. ఈ కేసులో కుట్రదారు చంద్రబాబే అన్నారు. రేవంత్‌రెడ్డిపై విచారణ చేపడుతుంటే టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, వీరికి ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం, చట్టం ఉందేమో అన్న అనుమానం కలుగుతుందన్నారు. రాజ్యాంగానికి, చట్టానికి అతీతులుగా మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. ఓటుకు కోట్లు కేసు టీడీపీ రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ట అన్నారు. ఒక దొంగతనం కేసు, మర్డర్‌ కేసులో,  చోరీ కేసులో సొత్తు రికవరీ అయిన తరువాత కుట్రదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటారన్నారు. ఓటుకు కోట్లు కేసులో నాలుగేళ్లు సామన్లు రాకపోవడం ఆశ్చర్యకరమన్నారు. ఎమ్మెల్యే స్టిఫెన్‌సన్‌ స్టేట్‌మెంట్‌ రికార్డు చేసినా కూడా ఇంతవరకు చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. విచారణ ప్రక్రియ వేగవంతం కాగానే ఆపరేషన్‌ గరుడ అంటూ ప్రచారం మొదలుపెట్టారన్నారు. ఓటుకు కోట్లు కేసు విచారణ ప్రారంభం కాగానే టీడీపీ నేతల గుండెల్లో దడ పుట్టిందన్నారు. 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసి రాజ్యాంగానికి తూట్లు పొడిచారన్నారు. ఈ కేసులో  న్యాయ ప్రక్రియ కొనసాగించాలని ఆయన డిమాండు చేశారు. చంద్రబాబును పిలివాలని, ఆయనకు సమన్లు ఇవ్వాలని డిమాండు చేశారు. 


 

తాజా వీడియోలు

Back to Top