అగ్రిగోల్డ్ బాధితులకు అండగా వైయస్‌ఆర్‌సీపీ
అగ్రిగోల్డ్ ఆస్తులు,అప్పులపై శ్వేతప్రతం విడుదల చేయాలి
హైకోర్డు నేతృత్వంలో సీబీఐ విచారణ చేపట్టాలి..
అగ్రిగోల్డ్ బాధితులు బాసట కమిటీ సమావేశంలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు..
విజయవాడః బాధితులకు న్యాయం చేయకుండా అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకోవడానికి టీడీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు.విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితులు బాసట కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఒక రూపాయి కూడా టీడీపీ ప్రభుత్వం ఇప్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 206 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.బాధితుల తరపున ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పోరాటం వల్లనే టీడీపీ ప్రభుత్వం హడావుడిగా కేవలం 143 మందికి 5 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. బాధితులు డబ్బులు ఇవ్వడానికి చేతులు రావడం లేదన్నారు. రూ.11వందల 80 కోట్ల రూపాయాలు ప్రభుత్వం చెల్లిస్తే 14 లక్షల బాధితులకు ఉపశమనం కలుగుతుందని వైయస్ జగన్ పదే పదే చెప్పినా టీడీపీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. బాధితులను ఆదుకోవాలనే మానవత్వం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం దీక్షలు, ప్రచారం పేరుతో ప్రత్యేక విమానాలతో తిరుగుతూ, పుష్కరాల పేరుతో వందల కోట్ల రూపాయాలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందే తప్ప బాధితులకు న్యాయం చేయడంలేదని దుయ్యబట్టారు. ఎండలో నిలబడి అగ్రిగోల్డ్ బాధితులు పోలీసుస్టేషన్లలో తమ పేర్లను నమోదు చేయించుకున్నారని, బాధితుల లిస్టు ఆన్‌లైన్‌లో పెట్టకుండా రహస్యంగా ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. వారికి రావాల్సిన డబ్బులు వివరాలు ఎందుకు దాచుస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎంతమందికి నష్టపరిహారం ఇచ్చింది నేటికి బయటకు రాలేదన్నారు. టీడీపీ ప్రభుత్వంపై బాధితులకు నమ్మకం పోయిందన్నారు. చంద్రబాబు దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలనే ఆలోచనతో అందిన కాడికి దోచుకునే పనిలో పడ్డారని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి శృంగభంగం కలుగబోతుందన్నారు. హాయ్ ల్యాండ్ ఆస్తులను అప్పనంగా దోచుకోవడానికి పకడ్భందీ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. హాయ్‌ల్యాండ్ అగ్రిగోల్డ్ సంబంధించింది కాదంటూ కోర్టులో అఫిడవిట్ వేశారని, ప్రజల తిరగుబాటుకు భయపడి, .వైయస్‌ఆర్‌సీపీ గట్టిగా ప్రశ్నించడంతో. కాదు కాదు అది అగ్రిగోల్డ్‌కు సంబం«ధించినదే అంటూ అఫిడవిట్ వేసిందన్నారు. బాధితులకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ అండగా వుంటుందని భరోసా కల్పించారు. బాధితులు ఆందోళన చెందిన ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. టీడీపీ ప్రభుత్వం మెడలు వచ్చి బాధితులకు రావాల్సిన ప్రతిపైసా కోసం ప్రభుత్వంపై వైయస్‌ఆర్‌సీపీ పోరాడుతుందన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల తరపున ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని తెలిపారు. వైయస్ జగన్ దృష్టికి సమావేశం వివరాలను తీసుకెళ్తామని తెలిపారు. త్వరలో ప్రత్యక్ష కార్యాచరణంతో ముందుకు సాగునుందని తెలిపారు.బాధితులతో క్షేత్రస్థాయి పోరాటం ప్రారంభిస్తామన్నారు.దీనిలో భాగంగా 16న ఆదివారం ఉదయం 10 గంటలకు విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో జరిగే సమావేశానికి అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి 13 జిల్లాల్లో 25 పార్లమెంట్లు సంబంధించి అగ్రిగోల్డ్ బాధితుల పెద్దలందరిని
సమావేశానికి ఆహ్వానిస్తున్నామన్నారు. పార్టీకి సంబంధించి పెద్దలు కూడా హాజరు కాబోతున్నారన్నారు. మరో సారి సమీక్షించి మాట్లాడి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికైన స్పష్టంగా ఆస్తులు, అప్పులు, బాధితుల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం మొండిగా ముందుకు సాగితే వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన ఆరునెలల కాలంలోనే బాధితులకు రావాల్సిన ముందుగా 11 వందల 80 కోట్లు వెంటనే చెల్లించడంతో పాటు మిగతా బాధితులకు రావాల్సిన ప్రతి పైసా ఇప్పిస్తామని తెలిపారు.
–హైకోర్డు నేతృత్వంలో సీబీఐ విచారణే పరిష్కారమార్గంః పార్థసారధి.
అగ్రిగోల్డ్‌కు సంబంధించి 20 లక్షల మందికి న్యాయం విషయంలో ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోందని వైయస్‌ఆర్‌సీపీ నేత పార్థసారధి ప్రశ్నించారు. కేవలం 11వందల 80 కోట్ల రూపాయలు చెల్లించినట్లయితే 80 శాతం అనగా సుమాఉ 16 లక్షల కుటుంబాలు స్వాంతన చేకూరే అవకాశం ఉందన్నారు.బాధితులకు న్యాయం చేయకుండా టీడీపీ మాయాజాలం చేస్తుందన్నారు. చంద్రబాబుకు సమస్యను పరిష్కరించాలనే ఆలోచన లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం తీరుపై అనేక అనుమానాలు రేకేత్తిస్తోందన్నారు. బాధితులకు తమ సొమ్మును ఇప్పించడంలో ప్రభుత్వం దోబూచులాట ఆడుతుందన్నారు. హైకోర్టు నేతృత్వంలో సీబీఐ ఎంక్వైరీ వేయించడం ఒకటే పరిష్కారం అన్నారు. బాధితులు ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయారు. రాబోయే ప్రభుత్వం తప్పకుండా జగన్ నాయకత్వంలో బాధితులకు న్యాయం చేస్తుందన్నారు.
–అగ్రిగోల్డ్ ఆస్తులు,అప్పులపై శ్వేతప్రతం విడుదల చేయాలిః మల్లాది విష్ణు
అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కరించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని వైయస్‌ఆర్‌సీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన పట్టించుకోవడంలేదన్నారు. సుమారు 30 లక్షల అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాల ఆర్తనాదాలు, ఆందోళనలు చంద్రబాబుకు కనబడటం లేదని మండిపడ్డారు. చంద్రబాబు అనుభవం,పరిపాలనకి ఇది నిలువుటద్దం అని అన్నారు. శాసన సభ వేదికగా కూడా నిలదీసినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. కొంతమందికి చెక్కులిచ్చి మొత్తం సమస్యను పరిష్కరించమనట్లు చంద్రబాబు తన ఎల్లో మీడియాలో రాయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో బాధితుల సమస్యలపై కూలంకషంగా చర్చించి న్యాయం చేస్తామన్నారు.టీడీపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ సమస్యను తేలిగా పరిష్కరించవచ్చని, అనేక సార్లు రాష్ట్ర హైకోర్టు మొట్టికాయలు వేసిన ప్రభుత్వం స్పందించలేదన్నారు. కేవలం ప్రతిపక్షాలను విమర్శించడానికే మంత్రులు ఉన్నారని పని చేయడానికి కాదని విమర్శించారు..ప్రభుత్వానికి కనువిప్పు కలిగేవిధంగా వైయస్‌ఆర్‌సీపీ పోరాటాలను ఉ«ధృతం చేస్తుందన్నారు.