హైదరాబాద్: స్వర్గీయ ఎన్‌టీ రామారావుకు హరికృష్ణ చాలా ఇష్టమైన కుమారుడని, ఆయనకు కూడా తండ్రిపై ప్రేమ ఉన్న వ్యక్తి అని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. తండ్రికి అండదండగా ఉన్నారని గుర్తు చేశారు. నందమూరి హరికృష్ణ మరణం పట్ల వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదం తనను కలిచి వేసిందని, ఇలాంటివి పక్కవారికి జరిగితేనే బాధపడుతామని, అలాంటిది సొంతింటి వారికి జరిగితే భరించలేమన్నారు. హరికృష్ణ ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అన్నారు. అనవసరంగా మాట్లాడరని, ఏదైనా అన్యాయం జరిగితే ఎదురించే వ్యక్తి అన్నారు. ధీటుగా సమాధానం చెప్పే అబ్బాయన్నారు. అన్యాయాన్ని అసలు సహించలేరన్నారు. ఓపెన్ మైండ్, వాâ¶ ్ల నాన్న ఎన్‌టీ రామారావుకు ఉన్న ధైర్యమంతా హరికృష్ణకు వచ్చిందన్నారు. దురదృష్టం జరుగకూడనిది జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1982లో ఎన్‌టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు హరికృష్ణ చైతన్యరథ సారధిగా తండ్రికి చేదోడు..వాదోడుగా ఉండేవారన్నారు. చంద్రబాబు చేసిన కుట్రలో హరికృష్ణ తెలియకుండా భాగస్వామి అయ్యారని, ఆ తరువాత రియలైజ్ అయి అక్కడి నుంచి బయటకు వచ్చి తండ్రిని అర్థం చేసుకున్నారని చెప్పారు. తాను కూడా మూడు సార్లు హరికృష్ణను కలిశానని, ఎన్‌టీఆర్‌కు భారత రత్న ఇప్పించేందుకు సహకరిస్తానని మాట ఇచ్చినట్లు గుర్తు చేశారు. తండ్రి పోలికలు, సంస్కారం, తెలుగు భాష పట్ల మమకారం, గౌరవం, చక్కగా మాట్లాడగలిగే వ్యక్తి అన్నారు. ఇవాళ హరికృష్ణ మా కుటుంబానికి దూరమయ్యారంటే తట్టుకోలేకపోతున్నానని పేర్కొన్నారు. మొన్న హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ ఇలాగే రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, ఇవాళ హరికృష్ణకు ఇలా జరగడంతో పైనున్న స్వర్గీయ ఎన్‌టీరామారావు ఆత్మ చాలా ఘోషిస్తుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.