అన్నకు అడుగడుగునా నీరాజనాలు

పేదల కన్నీళ్లు తుడిచేది వైయస్‌ జగన్‌ ఒక్కరే
పి.గన్నవరం కోఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు
తూర్పుగోదావరి: కోనసీమ ప్రజలు అన్నకు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ పి.గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ పాదయాత్రగా తూర్పున అడుగుపెట్టింది మొదలు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. వైయస్‌ జగన్‌కు తమ కష్టాలు చెప్పుకుంటూ.. ఆయన్ను ఆశీర్వదిస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. 198వ రోజు ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్ని చిట్టిబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఓఎన్‌జీసీ బాధితులను వైయస్‌ జగన్‌ పరామర్శించారన్నారు. ఒలుపు, దింపు కార్మికుల సమస్యలపై వైయస్‌ జగన్‌ స్పందించారన్నారు. 200ల రోజుల ప్రాదయాత్ర చేయడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇప్పటి వరకు ప్రజల శ్రేయస్సు కోసం 200ల రోజులు పాదయాత్ర చేసిన నాయకుడు ఎవరూ లేరన్నారు. తెలుగుదేశం పార్టీ పేదల కష్టాలు పట్టించుకోకుండా వారి స్వప్రయోజనాలతోనే ముందుకు సాగుతున్నారని మండిపడ్డారు. పేదల కన్నీళ్లు తూడ్చేందుకు వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేపట్టారన్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. 
Back to Top