దర్యాప్తునకు సిద్దమేనా..వైయస్సార్సీపీ నేత కావటి సవాల్

గుంటూరు) అమరావతిలోని
సదావర్తి సత్రం భూముల విషయంలో నిబంధనలకు తిలోదకాలిచ్చిన మాట వాస్తవం కాదా అని
ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ను పెదకూరపాడు నియోజకవర్గం వైయస్సార్సీపీ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు ప్రశ్నించారు. భూములు
ఆక్రమణలో ఉన్నాయని, వాటిని
కొనుగోలు చేసి, ఆలయ అభివృద్ధికి ఆ నిధులు
వెచ్చించాలని కొమ్మాలపాటి లేఖ రాయడం నిజం కాదా తేల్చి చెప్పాలని కోరారు. పూర్తి నీతి నిజాయితీలతో సదావర్తి
భూములు కొనుగోలు చేసి ఉంటే సీనియర్ సిట్టింగ్ జడ్జితోనూ, లేక రిటైర్డ్ జడ్జితోనూ దర్యాప్తు చేయించే దమ్ము ఉందా అని  సవాల్
విసిరారు. గుంటూరు లోని జిల్లా పార్టీ కార్యాలయంలో
 ఆయన
విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

 టీడీపీ
అధికారంలోకి వచ్చిన తరువాత ప్రణాళికా బద్ధంగానే భూములు దోచుకునేందుకు ఈవో
నల్లకాలువ శ్రీనివాసరెడ్డిని నియమించుకున్నారని ఆరోపించారు.  చెన్నైలో సదావర్తికి సంబంధించిన 83 ఎకరాలను వైఎస్సార్ సీపీ నిజనిర్ధారణ కమిటీ చైర్మన్ ధర్మాన
ప్రసాదరావు నేతృత్వంలో పరిశీలించామని తెలిపారు. స్థానికులను, అక్కడి ప్రజలను, మీడియా
ప్రతినిధులను పరిస్థితులను అడిగి తెలుసుకున్నామన్నారు.  భూములను పూర్తిస్థాయిలో అక్రమంగా కొనుగోలు చేసినట్లు తమ
దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.తమిళనాడు ప్రభుత్వమే రూ. 6.50 కోట్లు
ఎకరం విలువ ఉందని చెప్పడం నిజం కాదా అని ప్రశ్నించారు.  ఎటువంటి టెండర్ల ప్రక్రియ లేకుండా, దేవాదాయ శాఖ భూములు విక్రయించాలంటే తప్పనిసరిగా హైకోర్టు
అనుమతి అవసరమని, వాటిని కూడా బేఖాతరు చేసి కేవలం
రూ. 28 లక్షలు చొప్పున భూములు కొనుగోలు చేయడం సిగ్గుచేటన్నారు. 

Back to Top