<br/><strong>– టీడీపీ ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇవ్వడానికే సీఐడీతో విచారణ</strong><strong>–వైయస్‌ఆర్‌సీపీ గురజాల ఇన్‌చార్జ్ కాసు మహేష్‌రెడ్డి</strong>గుంటూరు: అధికార తెలుగు దేశం పార్టీకి సీఐడీ తోక సంస్థగా మారిందని, అక్రమాల ఘనుడైన యరపతినేనికి క్లీన్ చిట్ ఇవ్వడానికే సీఐడీతో విచారణ చేయిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ గురజాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు. సీబీఐతో జరపాల్సిన విచారణను సీఐడీతో జరపడమేంటని ఆయన ప్రశ్నించారు. ఏపీలో ఏ ఎమ్మెల్యేనైనా విచారించిన ఘనత సీఐడీకి ఉందా అని నిలదీశారు. రూ.500 కోట్లు దోచిన ఈ స్కామ్‌ను సీబీఐతో విచారణ చేయించాలని, సరస్వతి భూములపై యరపతినేని ఆరోపణలు అవాస్తవమన్నారు. రూ.70 వేలు విలువైన భూములను అప్పట్లోనే రూ.2, 3 లక్షల చొప్పున కొన్నారని, త్వరలోనే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెడతారని, స్థానికులకు ఉపాధి కల్పిస్తారన్నారు.