కరువు కనిపించడం లేదా?


 గుంటూరు: రాష్ట్రంలో 400 మండలాల్లో రైతులు తీవ్ర కరువు పరిస్థితులతో అల్లాడుతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.  ఒక పక్క కరువు ఉంటే దీన్ని అవకాశంగా తీసుకొని రైన్‌ గన్ల కోసం రూ.1600 కోట్లు దోచుకునేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. ఇటీవల టీడీపీ మంత్రులు  విఫరీతంగా ఫోటోలకు ఫోజులిస్తు ప్రజాధనాన్ని దోచుకునేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు.  టీడీపీ మంత్రి దేవినేని ఉమా ప్రగల్భాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 14 లక్షల ఎకరాల్లో సాగునీటి విస్తిర్ణం తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
Back to Top