బాబూ..నీ ధనదాహం తీరలేదా?



– చంద్రబాబు అండ్‌ టీమ్‌ అగ్రిగోల్డు ఆస్తులు దోచారు
– అగ్రిగోల్డు ఖాతాదారులను నిలువునా ముంచారు
– చంద్రబాబు, లోకేష్‌ హాయ్‌లాండ్‌ను అన్యాక్రాంతం చేశారు
– çహాయ్‌లాండ్‌ ఆస్తులు నావంటూ మరొకరు తెరపైకి రావడం విడ్డూరం
– రాష్ట్రంలో 16 లక్షల కుటుంబాలు వీధిపాలు చేశారు
– అగ్రిగోల్డు బాధితులకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుంది
– విశాఖలో కూడా భూ దోపిడీ చేశారు  
విశాఖ: అధికారం ఉందన్న అహంకారంతో పట్టపగలే గజదొంగల్లా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబూ ..నీ ధనదాహం తీరలేదా?..ఇంకా ఎంత దోచుకుంటావని ఆయన ప్రశ్నించారు. అధికార దుర్వినియోగంతో భూ దోపిడీ జరుగుతుందని విమర్శించారు.  సీబీఐతో దర్యాప్తు జరుగుతుందని భయపడుతున్నారని తెలిపారు. విశాఖపట్నంలో శనివారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.  ఇంతవరకు ప్రభుత్వ ఖజానా దోచుకోవడమే కాకుండా సుమారు 16 లక్షల మందికి సంబం«ధించిన అగ్రిగోల్డుకు సంబంధించిన ఖాతాదారులను మోసం చేసి, నిట్టనిలువనా దగా చేశారన్నారు. నిన్నటి రోజు కోర్టులో జరిగిన వాదోపవాదాలు, ఆ తరువాత వారి చర్యలు చూసిన తరువాత అగ్రిగోల్డుకు సంబంధించిన హాయ్‌ల్యాండ్‌ ఆస్తిని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ అన్యాక్రాంతంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేశం మొత్తం మీద ఉన్న 19 లక్షల ఖాతాదారులకు ఇది ఒక శాపంలా దాపురించిందన్నారు. ఇదంతా పారదర్శకంగా జరుగుతుందని, సీబీ సీఐడీదో విచారణ చేయించామని, అగ్రి  గోల్డు ఆస్తుల విలువ ఇంత ఉందని చెబుతూ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఈ విషయాలు అందరికీ తెలుసు అని గుర్తు చేశారు. చంద్రబాబు నీ దనధాహం తీరడం లేదా? రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టి వేల కోట్లు దోచుకుంటున్నావని ప్రశ్నించారు. ఖాతాదారులకు రావాల్సిన సొమ్మును దోచుకోవడం ధర్మమా? వారి ఉసురు మీకు తగులుతుందని హెచ్చరించారు. బాధితులు పడుతున్న ఇబ్బందులు మీకు తెలియవా అని ప్రశ్నించారు. అగ్రిగోల్డు సమస్య ఉత్పన్నమైన తరువాత, చట్టపరమైన కేసులు నమోదు అయిన తరువాత సాక్షాత్తు శాసన సభలోనే ప్రతిపక్ష నాయకులు వైయస్‌ జగన్‌ ఈ అంశంపై మాట్లాడితే..ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఒక స్టేట్‌మెంట్‌ ఇచ్చారన్నారు. వాటి ఆస్తులు, పరిస్థితులు చెప్పారన్నారు. అప్పట్లోనే మేం ప్రతిపక్షంగా ఆగ్రిగోల్డు ఆస్తులు అన్యాక్రాంతం చేస్తున్నారని, మీ మంత్రుల కళ్లు పడ్డాయని మేం చెప్పామన్నారు. న్యాయస్థానం కళ్లు గప్పి వారిని కూడా మోసం చేసే స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారిందన్నారు. న్యాయస్థానంలో గత నెలలో జరిగిన విచారణలో హయ్‌లాండ్‌ను తాకట్టుకు పెట్టి బ్యాంకులు రుణాలు ఇచ్చాయో..ఆ బ్యాంకులను అమ్ముకునేందుకు అనుమతించిందన్నారు. సడన్‌గా నిన్నటి  రోజు ఈ ఆస్తి నాది కాదు అని ఒకరు, నాది అని మరోకరు తెరపైకి రావడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. ప్రభుత్వం దోపిడీ చేసేందుకు కుట్ర పన్నుతుందని, సీబీ సీఐడీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. టీడీపీ నేతలు దీనిపై స్పందించాలని డిమాండు చేశారు. లోకేష్‌ హయ్‌లాండ్‌ను దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మేం ఎప్పుడో చెప్పామన్నారు. విశాఖపట్నంలో భూ కబ్జాలు ఎలా జరిగాయో మేమందరం చూశామన్నారు. నగరంలోని భూములను చంద్రబాబు చుట్టాలు అక్రమించుకుంటున్నారో, అదే రకంగా న్యాయస్థానం పరిధిలో జరుగుతున్న విచారణలో 16 లక్షల మంది ఖాతాదారులకు సంబంధించిన ఆస్తులను దోచుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. విదేశీ సంస్థ ఈ ఆస్తులు కొనేందుకు వచ్చిన సందర్భంలో మా పార్టీ నేతలు నిరాహారదీక్ష చేస్తే..ఆ సమయంలో సీఎం ఢిల్లీ పర్యటనలో అమర్‌సింగ్‌ను కలిశారన్నారు. అప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడేందుకు వచ్చానని చంద్రబాబు బుకాయించారన్నారు. మూడు రోజులకే వారు కోర్టును ఆశ్రయించారన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేపట్టాలని డిమాండు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పునాదిరాయి వేసిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి నాలుగున్నరేళ్ల పాలనలో ఒ క్క రూపాయి కూడా కేటాయించకుండా అన్యాయం చేశారని, ఎన్నికలు దగ్గరపడటంతో అంచనాలు పెంచి దోచుకునేందుకు నిన్న శంకుస్థాపన చేశారన్నారు. అందరి కడుపు కొట్టి ప్రజా«ధనాన్ని దోచుకోవాలని చంద్రబాబు దుర్మార్గంగా ఆలోచిస్తున్నారన్నారు. ప్రభుత్వం అగ్రిగోల్డు బాధితులను ఏ రకంగా ఆదుకుంటారో సమాధానం చెప్పాలని, ఈ దోపిడీ నుంచి 16 లక్షల ప్రజలను కాపాడాలని ఆయన డిమాండు చేశారు. అగ్రిగోల్డు బాధితులకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top