వృద్ధ దంపతులను పరామర్శించిన ఎమ్మెల్యే దాసరి సుధా

బాధితులకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని భరోసా

 
బద్వేలు, జూలై 20: బద్వేల్‌లో టీడీపీ నాయకుల దాడికి గురైన వృద్ధ దంపతులను వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా  పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. బాధితుల సమస్యలను తెలుసుకుని, పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ, తాము నివాసం ఉంటున్న ఇంటి స్థలం తమదేనని ప్రభుత్వ అధికారులు గుర్తించినప్పటికీ,  టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేశ్ తో పాటు ఆయన అనుచరులు ఇంటిని కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వృద్ధ మహిళ జాకెట్ చించి అవమానించడమే కాకుండా, తమపైనే తప్పుడు కేసులు నమోదు చేశారని ఎమ్మెల్యే దాసరి సుధాకు వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా మాట్లాడుతూ, మహిళల పట్ల కూటమి నాయకులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నా పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. నెల రోజుల క్రితమే గోపవరం తహసీల్దార్ బాధితులకు పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత కూడా వారి ఇంటిపై దాడి చేయడం చట్ట విరుద్ధమని అన్నారు. 
బాధితులపై తప్పుడు కేసులు ఎత్తివేసి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా నిలిచి పోరాడుతుందని ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా స్పష్టం చేశారు.
 

Back to Top