తిరుపతిః చంద్రబాబు పచ్చి అవకాశవాది అని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.చంద్రబాబు కాంగ్రెస్‌తో చేతులు కలపటం స్వార్థమే కోసమే అని విమర్శించారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీ స్థాపించారన్నారు.ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని బాబు లాక్కున్నారు. ఇప్పుడు టీడీపీని కాంగ్రెస్‌ను పాదాల కింద పెడుతున్నారన్నారు.రాహుల్ గాంధీని చంద్రబాబు కలవడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్‌తో చంద్రబాబుకు చాలా ఏళ్లుగా సంబంధాలున్నాయన్నారు. సోనియాతో కుమ్మక్కె జగన్‌పై అక్రమ కేసులు పెట్టించారన్నారు.జగన్‌కు లభిస్తున్న ఆదరణ చూసి బాబకు వెన్నులో చలి పుడుతోందన్నారు. అందుకే ఏ పార్టీతోనైనా కలిసేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారన్నారు.<br/>