బాబూ..ఎందుకా గజగజ


– చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు
– తనను ఎవరూ ప్రశ్నించరాదన్న స్థాయికి చంద్రబాబు వచ్చారు
– చంద్రబాబు దేశ ఔన్నత్యాన్నే ప్రశ్నిస్తున్నారు
– చంద్రబాబు పాలన రాజ్యాంగబద్ధంగా సాగడం లేదు
– దేశంలో ఏపీ అంతర్భాగం కాదా?
– వైయస్‌ జగన్‌ను ఎదుర్కొనే సాహసం చంద్రబాబుకు లేదు.

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ నియంతలా మారిపోయారని, ఏ తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసే విధంగా చంద్రబాబు పరిపాలన సాగించడం దురదృష్టకరమన్నారు. వైయస్‌ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కునే ధైర్యం లేక ఎన్‌డీఏ కూటమి నుంచి యూపీఏ కూటమిలో చే రిపోయారన్నారు. ఎన్ని కుట్రలు చేసినా వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోలేరని స్పష్టం చేశారు. రాష్ట్రంలోకి సీబీఐ రాకుడదని చంద్రబాబు జీవో విడుదల చేయడం దుర్మార్గమని,  ఇలాంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు.. చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు ఏ రాజ్యాంగ వ్యవస్థ పని చేయకుండా చేస్తున్నారన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.  భారత దేశ సమగ్రతను కాపాడాలని సేవ్‌ డెమోక్రసీ అంటూ ఢిల్లీలో మాట్లాడిన చంద్రబాబు..ఏపీలో ఏ వ్యవస్థ కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడకూడదనే స్థాయికి వచ్చారన్నారు. నలభై ఏళ్ల రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబు నాలుగు పదుల వయసు దాటని వైయస్‌ జగన్‌పై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.  ఇవాళ రాష్ట్రంలో వ్యవస్థలను పని చేయకుండా దేశ సమాఖ్యస్ఫూర్తికి  ఇది ప్రమాదకరమన్నారు. ఫ్రెడరల్‌ స్ట్రచర్‌ను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. నిన్న విడుదల చేసిన జీవో 176 ను చూస్తే..సీబీఐ అనే వ్యవస్థ తన రాష్ట్రంలో పని చేయకూడదని, తన అనుమతి ఉండాలని ఆదేశం ఇచ్చారన్నారు. అప్పుడే దేశ ఔనత్యాన్ని ప్రశ్నించే ముఖ్యమంత్రిగా తయారయ్యారన్నారు. దేశ రాజ్యాంగంలో నీవు అంతర్భాగం కాదా అని నిలదీశారు. దేశంలో ఏపీ కూడా భాగమే కదా అన్నారు. చంద్రబాబు రాజ్యాంగేతర శక్తిగా మారాలని భావిస్తున్నారన్నారు. చంద్రబాబు..నీకేందుకు  ఇంత భయమన్నారు. గజ తుపాను వల్ల ప్రజలు భయపడుతారనుకుంటే..చంద్రబాబు తన అవినీతిని చూసి ఎక్కడ విచారణ జరుగుతుందో అని గజ గజ వణుకుతున్నారని ఎద్దేవా చేశారు. తన అనుకూలురైన సారా కాంట్రాక్టర్ల నుంచి రాష్ట్రంలో అతిపెద్ద కాంట్రాక్టర్లుగా మారిన పన్ను ఎగవేత దారులను పట్టుకునేందుకు ఐటీ అధికారులు వస్తే చంద్రబాబు భయపడుతున్నారన్నారు. ఆయన కుటుంబానికి ఆర్థికంగా ఉపయోగపడుతున్న అనేక వ్యాపారసంస్థలు పన్నులు ఎగవేతదారులుగా ఉంటే..వాటిని ప్రశ్నించేందుకు వస్తే ఆందోళన చెందుతున్నారన్నారు. నీ అవినీతిని ప్రశ్నించేందుకు వస్తున్న వ్యవస్థలు వస్తుంటే ఢిల్లీకి వెళ్లి అనేక రాజకీయ పార్టీలను కలవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. మూడు నెలల క్రితం సీబీఐ అనే సంస్థ ఏపీలో విచారణ చేయవచ్చు అని చెప్పిన చంద్రబాబు అంతలోనే ఎందుకు నిర్ణయం మార్చుకున్నారని ప్రశ్నించారు. రేపు హైకోర్టులో ఈ రాష్ట్ర ప్రభుత్వంపై, మంత్రిపైనా విచారణ చేయమని ఆదేశిస్తే..ఆ విచారణ వద్దు అనే చెబుతారా అని నిలదీశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, సీనియర్‌ జడ్జిలను ప్రశ్నిస్తే వారు సరిచేసుకునే ప్రయత్నం చేశారన్నారు. చంద్రబాబు అనాలోచిత, అహంకారపూరిత దోరణి కలిగిన ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదన్నారు. పశ్చిమ బెంగాల్‌ లాంటి రాష్ట్రంలో జ్యోతిబసు లాంటి రెండున్నర దశాబ్ధాల పాటు పాలన చేశారన్నారు. ఆయన రాష్ట్రానికి మేలు జరుగాలని కోరుకున్నారని గుర్తు చేశారు. సమక్య స్ఫూర్తికి వ్యతిరేకంగా ఎప్పుడు పని చేయలేదన్నారు. మిగతా ముఖ్యమంత్రులు కూడా సమక్య స్ఫూర్తికి విరుద్ధంగా పని చేయలేదన్నారు. అయితే చంద్రబాబు శాషించే స్థాయికి రావడం దుర్మార్గమన్నారు. ఎన్‌టీ రామారావును వెన్నుపోటు పొడిచి, టీడీపీని తీసుకున్నారన్నారు. ఇన్నాళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా చంద్రబాబు ఎప్పుడు సీబీఐ విచారణ కోరలేదా అని ప్రశ్నించారు. దేశంలో అనేక మంది ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులుగా పనిచేశారని, ఎవరూ కూడా రాజ్యాంగాన్ని ప్రశ్నించలేదన్నారు. ఏపీని ప్రత్యేక దేశంగా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని, చంద్రబాబుకు అసలు సీఎంగా కొనసాగే అర్హత ఉందా అని దుయ్యబట్టారు. అన్ని వ్యవస్థలను ప్రభావితం చేసి, ఆ వ్యవస్థ ఫలితాలు ఏపీ ప్రజలకు రాకుండా దురుద్దేశంతో ఉన్నారన్నారు. చంద్రబాబుకు భయం పట్టుకుందని, ఒంటరి పోరాటం చేస్తున్న వైయస్‌ జగన్‌ను ఎదుర్కొనేందుకు ధైర ్యం చాలక ఎన్‌డీఏ వదిలి యూపీఏకు వెళ్లారన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడుసార్లు సీబీఐ విచారణ కావాలని కోరారని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి వెంటనే సీబీఐ విచారణ చేయించి, క్లీన్‌సిట్‌ తీసుకున్నారన్నారు. ఎందుకా గజ గజ అని నిలదీశారు. ఏ తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నావని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన అనేక దోపిడీలు, వ్యవస్థలను నిర్వీర్యంలో చేయడంలో ఆయన పాత్ర స్పష్టంగా బయటపడుతుందనారు. ఇలాంటి వ్యక్తికి ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
 
Back to Top