ఆ మహిళా ఎస్‌ఐ మా ఆడపడుచు 

ఆమె ఆత్మగౌరవానికి భంగం కలిగించి రాజకీయ లబ్ధి పొందడం దారుణం

ర్యాలీలో జరిగింది వేరు.. ‘అధికార మీడియా’ చిత్రీకరించింది వేరు 

మహిళా ఎస్‌ఐ రెండేళ్లుగా మాకు సుపరిచితురాలు

వీడియో విడుదల చేసిన  వైయ‌స్సార్‌ సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్‌  

శ్రీకాకుళం జిల్లా: ఇటీవల జిల్లాలో జరిగిన వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పర్యటన విజయవంతమైందని, దాన్ని తట్టుకోలేక కూటమి ప్రభుత్వం, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ సూచనతో బూర్జ మండల ఎస్‌ఐ ప్రవళ్లికను పావుగా వాడుకొని ఆమె ఆత్మగౌరవానికి భంగం కలిగించడం దారుణమని వైయ‌స్సార్‌ సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ అన్నారు. ఆయన ఆదివారం ఓ వీడి యో విడుదల చేశారు. పర్యటనలో జరిగింది వేరు, మీడియాలో వచ్చింది వేరు అని ఆయన వివరించారు.
 
 ఎస్‌ఐ ప్రవళ్లిక గురించి కూన రవికుమార్‌ విలేకరుల సమావేశంలో మా ట్లాడిన మాటలు ఆమెను కించపరిచేలా ఉన్నాయని అన్నారు. రెండేళ్లుగా ఎస్‌ఐ ప్రవళ్లిక తనకు తెలుసని, ఇప్పుడు కేసు పెట్టిన వారిలో చాలా మందికి ఆమె అక్క, చెల్లి వరుస అవుతా రని తెలిపారు. వైఎస్‌ జగన్‌ పర్యటన విజయవంతం కావడంతో టాపిక్‌ డైవర్షన్‌ కోసం ఇంతకు తెగించారని చింతాడ అన్నారు. ఆ రోజు వైఎస్‌ జగన్‌ పర్యటనకు రాని వారిపై కూడా అక్రమ కేసులు పెట్టారని పేర్కొన్నారు. కొంతమంది ఉద్యోగులు తమ విధుల్లో ఉన్నారని వారి పేర్లు పెట్టారని, అలాగే ఢిల్లీలో ఉన్న వ్యక్తి పేరు కేసులో పెట్టారని, ఇవన్నీ మీడియా ముందుకు తీసుకువస్తానన్నారు.  

కేసులకు భయపడేదే లేదు 
తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేదే లేదని చింతాడ రవికుమార్‌ స్పష్టం చేశారు. తాను ఎ టో పారిపోయానని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తాను జిల్లాలోనే ఉన్నానని, తనతోపాటు మిగతా 20 మందిపై వేసిన కేసును తొలగిస్తే ఒక గంటలోనే తాను పోలీసుల వద్ద ఉంటానన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది వైయ‌స్సార్‌ సీపీ నాయకులపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. 

కేసులకు తాము భయపడబోమని, కానీ ఆడపడుచుల గౌరవానికి భంగం కలిగిస్తే సహించేది లేదని అన్నారు. ఆ రోజు ఎస్‌ఐ ప్రవళ్లిక జనాలను అడ్డుకొని వేరే వైపు వెళ్లాలని సూచిస్తున్న సమయంలో ఒక్కసారిగా జై జగన్‌ అంటూ నినాదాలు చేస్తుండగా ఆమె చెవులు మూసుకున్నారని, దాన్ని వేరే విధంగా చూప డం తగదన్నారు. 

నిజా నిజాలు ఆమెకు తెలు సని అన్నారు. మహిళా ఎస్‌ఐపై ఒత్తిడి తీసుకు వచ్చి మచ్చ లేని ఆమె సర్వీసులో మచ్చ తేటానికి ఎమ్మెల్యే కూన రవికుమార్‌ చేస్తున్న కుట్ర ను ఆపాలన్నారు. కూన కళ్లలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. మహిళా ఎస్‌ఐ గౌరవానికి భంగం పరిచేలా ఎలాంటి ఫొటోలు, కాని ట్రోలింగులు గానీ వైఎస్సార్‌ సీపీ వర్గీయులు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఆమె మన ఇంటి ఆడపడుచు అని, అది ఎప్పు డూ గుర్తుంచుకోవాలని సూచించారు.   

Back to Top