వైయ‌స్ జ‌గ‌న్ కోసం ఎదురు చూపు

గుంటూరు: యావత్‌ రాష్ట్ర ప్రజలు వైయస్‌ జగన్‌ కోసం ఎదురుచూస్తున్నారని, ఆయ‌న ప్పుడు ముఖ్యమంత్రి అవుతారా అని ప్రజలు ఆశగా చూస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త కావ‌లి మ‌నోహ‌ర్‌నాయుడు అన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌వేశించిన సంద‌ర్భంగా ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..వైయ‌స్ జ‌గ‌న్ త‌మ నియోజ‌క‌వ‌ర్గంలోకి రావడం సంతోషంగా ఉంద‌న్నారు. ఇక్క‌డి ప్ర‌జ‌లు ఆయ‌న కోసం ఎదురుచూస్తున్నార‌న్నారు.  చంద్రబాబు పాలనలో ప్రజలు అన్ని రంగాల్లో వెనుకబడ్డారన్నారు. నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ధన దాహానికి 23 మంది కృష్ణానదిలో చనిపోయారన్నారు. సదావర్తి సత్రం భూములు ఆక్రమించుకున్నారని విమర్శించారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రలో వేలాది మంది పాల్గొని విజయవంతం చేశారన్నారు. 
Back to Top