అవిశ్వాసంపై బాబుకు చిత్తశుద్ధి లేదు


న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. గతంలో ఎగతాళి చేసి ఇప్పుడు  తీర్మానం పెట్టారన్నారు. తామే ఛాంపియన్‌ అనిపించుకోవాలనే టీడీపీ కుయుక్తులు పన్నుతున్నారని, మరోసారి ప్రజలను మోసం చేసేందుకు బాబు ఎత్తులు వేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, టీడీపీలు కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. సొంత ప్రయోజనాలను నెరవేర్చుకోవాలనే తపన టీడీపీకి తప్ప రాష్ట్ర ప్రయోజనాలను ఆ పార్టీ పట్టించుకోవడం లేదన్నారు. విభజన హామీలు నెరవేర్చాలని మొదటి నుంచి కోరుతోంది వైయస్‌ఆర్‌సీపీనే అన్నారు. రాష్ట్ర సమస్యలకు పరిష్కారం చూపేది వైయస్‌ జగనే అన్నారు. 
 
Back to Top