వైద్య, రక్తదాన శిబిరాలు విజయవంతంకర్నూలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జన్మదినాన్ని( డిసెంబర్‌ 21) పురస్కరించుకొని కర్నూలు, గుంటూరు నగరాల్లో ఈ నెల 19వ తేదీ నిర్వహించిన వైద్య, రక్తదాన శిబిరాలు విజయవంతం అయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో పార్టీ వైద్య విభాగం, ఎన్‌ఆర్‌ఐ వింగ్‌ ఆధ్వర్యంలో రక్తదాన, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. కర్నూలులో ఏర్పాటు చేసిన శిబిరాన్ని పార్టీ కర్నూలు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే ఐజయ్య, సమన్వయకర్తలు హాఫీజ్‌ఖాన్, శ్రీదేవి, మురళీకృష్ణ, ఎన్‌ఆర్‌ఐ అమెరికా విభాగం నాయకులు పాల్గొన్నారు. అలాగే గుంటూరులో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని  పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా, ఎస్సీ సెల్‌ అధ్యక్షులు మేరుగు నాగార్జున ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తాన్ని దానం చేశారు.
 
Back to Top