ఇడుపులపాయలో 21న వైయస్ఆర్‌సీఎల్పీ భేటి

హైదరాబాద్:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌ విభాగం లెజిస్లేచర్ పార్టీ సమావేశ‌ం ఈ నెల 21న ఇడుపులపాయలో నిర్వహించనున్నట్టు పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ‌ఈ సమావేశంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారని ఆ ప్రకటన వెల్లడించింది. భవిష్యత్‌లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యక్రమాలను కూడా ఈ భేటీలో చర్చిస్తారు.

వైయస్ఆర్‌ సీఎల్పీ సమావేశం అనంతరం ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులతో శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి భేటీ అవుతారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు‌ దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్  వైయస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద పార్టీ నాయకులు నివాళులు అర్పిస్తారు.

Back to Top