రాజన్నను చూసినంత ఆనందంగా ఉంది

జననేతకు జేజేలు పలికిన ఓరుగల్లు ప్రజానీకం
అడుగడుగునా ఆత్మీయస్వాగతం
బొట్టుపెట్టి హారతులిచ్చిన మహిళలు
 
వరంగల్ః
ఓరుగల్లు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్
జగన్ ను చూసి పులకించిపోతున్నారు. మళ్లీ ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.
రాజశేఖర్ రెడ్డిని చూసినంత ఆనందంగా ఉందని అంటున్నారు. రాజన్న అంటే తమకు
ఎంతో ఇష్టమని, ఆయనతో మూడు కిలోమీటర్లు నడిచానని అక్కడి మహిళలు తమ
 జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మహిళలకు పావలావడ్డీ, అభయహస్తం,
వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు, ఉచిత విద్యుత్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు
అందించి అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నారని మహిళలు స్పష్టం చేశారు. అలాంటి
సీఎం మళ్లీ రావాలని కోరుకుంటున్నామని..వైఎస్సార్సీపీని గెలిపిస్తామని తేల్చిచెబుతున్నారు.

జిల్లాలోని
ఆత్మకూరులో మహిళలు వైఎస్ జగన్ కు ఘనస్వాగతం పలికారు. జననేతకు బొట్టుపెట్టి
హారతులిచ్చారు. వైఎస్ జగన్ ను కలిసినందుకు ఆనందం వెలిబుచ్చారు. ఎండనకా,
వాననకా  వైఎస్ రాజశేఖర్ రెడ్డి పల్లెలు తిరిగారని, రైతులను, ఆత్మహత్య
చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకున్నారని, వాళ్ల పిల్లలకు చదువులు
చెప్పించారని మహిళలు అన్నారు.  తన భర్త అప్పుల బాధతో చనిపోతే ఇంతవరకు ఎవరూ
ఆదుకోలేదని, మూడు సంవత్సరాలుగా ఆఫీసుల చుట్టు తిరిగినా ఎవరూ
పట్టించుకోలేదని ఓమహిళ వాపోయారు. మళ్లీ  రాజన్న బిడ్డను కలుసుకోవడం
సంతోషంగా ఉందని, వైఎస్సార్సీపీని గెలిపిస్తామని చెప్పారు.  వైఎస్  రాజశేఖర్
రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ అమలు కావాలంటే  వైఎస్సార్సీపీ
గెలుతోనే సాధ్యమని జగన్ ను ఆశీర్వదించినట్లు మహిళలు పేర్కొన్నారు. 

మహిళలు,
వృద్ధులు, విద్యార్థులు, యువకులు అంతా రాజన్న బిడ్డను చూడాలన్న ఆతృత
చూస్తుంటే...వైఎస్ . రాజశేఖర్ రెడ్డిని తమ గుండెల్లో పెట్టుకొని ఎంతగా
ఆరాధిస్తున్నారో అర్థమవుతోందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రజలు
మర్చిపోలేకపోతున్నారని,  ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలన్న ఉత్సాహంతో ఉన్నారని
 వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. రాజన్న ఆశయాలతో రూపొందిన వైఎస్సార్సీపీతోనే
తమ జీవితాలు బాగుపడతాయని ప్రజలంతా భావిస్తున్నట్టు చెప్పారు.
వైఎస్సార్సీపీ దిగ్విజయంగా గెలిచి ఓరుగల్లు గడ్డమీద జెండా ఎగరవేస్తుందని
ధీమా వ్యక్తం చేశారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సంక్షేమ ఫథకాలే తమను
గెలిపిస్తాయని అంటున్నారు.  హామీలు అమలు చేయకుండా మభ్యపెడుతున్న  టీఆర్ఎస్,
కాంగ్రెస్,టీడీపీ-బీజేపీలకు తగిన బుద్ధి చెబుతామని ఓటర్లు కుండబద్దలు
కొట్టారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్సీపీని అత్యధిక మెజారిటీతో
గెలిపిస్తామన్నారు. 
Back to Top