మా నాయ‌కుడు మాట త‌ప్ప‌డు.. మ‌డ‌మ తిప్ప‌డు

దర్శి (ఒంగోలు):

`` మా నాయ‌కుడు చంద్ర‌బాబు మాదిరి కాదు.. మాట ఇస్తే త‌ప్పే ప్ర‌స‌క్తే లేదు. అది ఎంత క‌ష్ట‌మైనా చేసితీరుతాడు`` అని మాజీ ఎమ్మెల్యే ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డి అన్నారు. వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మంలో భాగంగా శ‌నివారం  స్థానిక తాలూకా క్లబ్‌ సమావేశం హాలులో  పార్టీ నాయకులు, కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తొలుత కార్యక్రమం ఉద్దేశం, ఇతర వివరాలు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. బూత్‌ కమిటీలు ప్రతి ఇంటికి వెళ్లి నవరత్నాలు గురించి వివరించాలని కోరారు. చంద్రబాబు పాలనలో ప్రజలకు జరుగుతున్న అన్యాయం కూడా ప్రజలకు తెలియజేయాలని కోరారు. రాజన్న హయాంలో పార్టీలు, కుల మతాలకతీతంగా పథకాలు అందాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏ ఒక్క పథకం సామాన్యులకు అందే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు 600 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చిన పాపానపోలేదని మండిపడ్డారు. సొంత పార్టీ నాయకుల్లోనే బాబుపై వ్యతిరేకత ఉందని చెప్పారు. మాటతప్పని వ్యక్తిగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల్లో నమ్మకం సంపాదించుకున్నారన్నారు. జగన్‌ను సీఎం చేసే వరకూ ప్రతి కార్యకర్త బాధ్యతగా పని చేయాలని సూచించారు. మంత్రి శిద్దా రాఘవరావుకు ప్రజాసమస్యలు పట్టడం లేదని విమర్శించారు. నంద్యాల మాదిరి డబ్బులిచ్చి ఓట్లు కొనుగోలు చేయవచ్చని పాలకులు అనుకుంటున్నారని, ఇకపై అలాంటి ఎత్తులను ప్రజలే చిత్తు చేస్తారని బూచేపల్లి హెచ్చరించారు. లక్కవరంలో ప్రజలు జ్వరాలతో అల్లాడుతుంటే తాను అందరికీ మందులు అందించానని, కొందరికి ఆర్థిక సాయం కూడా చేశానని బూచేపల్లి గుర్తు చేశారు.

Back to Top