న‌వ‌ర‌త్నాలుతోనే రాజ‌న్న రాజ్యం సాధ్యం

బేస్తవారిపేట (ఒంగోలు):

 వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలుతోనే రాజ‌న్న రాజ్యం సాధ్య‌మ‌ని గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త ఐవీ రెడ్డి అన్నారు. వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మంలో భాగంగా శ‌నివారం  బూత్‌ కమిటీ కన్వీనర్లతో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలోనే అత్యధికంగా గిద్దలూరు నియోజకవర్గంలో గడపగడపకు తిరిగి వైయ‌స్ఆర్ కుటుంబంలో చేర్పించాలని కోరారు. టీడీపీ పాలనలో పెరిగిన అవినీతిని ప్రజలకు వివరించాలన్నారు. వైయ‌స్ఆర్  పాలనలో జరిగిన సంక్షేమ పథకాలను తెలియజేస్తూ ప్రతి కుటుంబానికి అండగా నిలిచేందుకు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలను తెలియజేయాలని సూచించారు. బూత్‌ కమిటీ కన్వీనర్లకు సభ్యత్వ నమోదుకు సంబంధించిన కిట్‌లను పంపిణీ చేశారు. 

Back to Top