నైతిక విజయం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదే

అమరావతి: స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నైతిక విజయం సాధించింది. సోమవారం నిర్వహించిన మండలి ఎన్నికల కౌంటింగ్‌లో వైయస్‌ఆర్‌ జిల్లా, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు అధికార టీడీపీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు. కడపలో అతిస్వల్ప మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గెలుపొందగా, కర్నూలులో కూడా వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. ఇక్కడ కూడా స్వల్పమెజారిటీతో అధికార పార్టీ గెలుపొందింది. 


అధికార టీడీపీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసిన నాటి నుంచి క్యాంపు రాజకీయాలు నిర్వహించింది. ఏకంగా మంత్రులు రంగంలోకి దిగారు. ఈ మూడు జిల్లాల్లో వాస్తవానికి వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ గుర్తు కింద గెలిచిన అభ్యర్థులు అధికంగా ఉన్నారు. అయితే టీడీపీ ప్రలోభాలకు తెర లేపి, అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష సభ్యులను కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించింది. ఇంత చేసినా కూడా ఆ పార్టీకి స్వల్ప అధిక్యం రావడంతో నైతిక విజయం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదే.
Back to Top