స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండండి

విజయనగరం 16 జూన్‌ 2013 :

స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. పార్టీని మరింత పటిష్టం చేసుకోవడానికి పంచాయతీ ఎన్నికలు వేదికగా ఉపయోగపడతాయని ఆమె తెలిపారు. స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్యే ఎన్నికల వరకు కార్యకర్తలంతా కలిసి పనిచేయాలని కోరారు. ప్రతి గ్రామంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగరాలని చెప్పారు. చిన్న చిన్న గొడవలు ఉన్నా పట్టించుకోకుండా పార్టీని పటిష్ట పరచడమే ధ్యేయంగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.‌

మహానేత డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి పట్ల, ఆయన మరణానంతరం తమ కుటుంబం పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలకు తామంతా రుణపడి ఉంటామన్నారు. అలాగే పార్టీ నాయకులు, శ్రేణులకు కూడా తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

అంతకు ముందు శ్రీమతి విజయమ్మ విజయనగరం చేరుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘనం గా స్వాగతం పలికారు.

Back to Top