వరద బాధితులకు పార్టీ వైద్య విభాగం సేవలు

డెహ్రాడూన్‌, 23 జూన్‌ 2013:

ఉత్తరాఖండ్ వరద‌లలో చిక్కుకున్న బాధితులకు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ వైద్య‌ విభాగం సేవలు అందిస్తున్నది. ఆరుగురు డాక్టర్లు, మరో ఆరుగురు వలంటీర్లతో కూడిన పార్టీ బృందం తొలి రోజు 1,500 మందికి వైద్యసేవలు అందించింది. డెహ్రాడూన్‌ విమానాశ్రయం సమీపంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసిన వైద్య బృందం ఈ సేవలు అందిస్తున్నది. ఈ శిబిరంలో బాధితులకు మందులు, వైద్య సేవలు అందిస్తున్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైద్య విభాగం కన్వీనర్‌ జి. శివభరత్‌రెడ్డి నేతృత్వంలో డాక్టర్లు అశోక్‌, నాగభూషణ్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, ఫణి సేవలు అందిస్తున్నారు.

మరోవైపున డెహ్రాడూన్‌లో భారీ వర్షం కురుస్తుండడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతున్నది. వరదల్లో చిక్కుకున్న వారి దగ్గరకు వెళ్లేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైద్య విభాగం వైద్యులు, వలంటీర్లు ప్రయత్నం చేస్తున్నారు.

Back to Top