అల్లూరి సీతారామరాజు జిల్లాలో 'జగనన్న 2.0 సూపర్ యాప్' ఆవిష్కరణ 

 ప్రతి కార్యకర్తకు పార్టీ నాయకత్వాన్ని చేరువ చేసే వేదికే జగనన్న 2.0 సూపర్ యాప్: మత్స్యరాస విశ్వేశ్వరరాజు 

అల్లూరి జిల్లా:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన  'జగనన్న 2.0 సూపర్ యాప్‌` ను అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మత్స్యరాస విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ, పార్టీ నాయకత్వం, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు క్షేత్రస్థాయి సమాచారాన్ని వేగంగా పార్టీ నాయకత్వానికి చేరవేసే సమర్థవంతమైన డిజిటల్ వేదికగా  జగనన్న 2.0 సూపర్ యాప్ పనిచేస్తుందని తెలిపారు. పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రతి వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు, కార్యకర్త, సోషల్ మీడియా ప్రతినిధి తప్పనిసరిగా  జగనన్న 2.0 సూపర్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకుని పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి సమర్థవంతంగా వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ కమిటీ సభ్యులు, వివిధ రాష్ట్ర అనుబంధ విభాగాల ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Back to Top