అర్హులైన పేదలందరికీ 45ఏళ్లకే పింఛన్

అనంతపురంః వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ పేద ప్రజల బాగోగుల కోసం అహర్నిషలు పరితపిస్తున్నారు.  అర్హులైన ప్రతి పేదవాడిని ఆదుకునేందుకు అనంతపురం వేదికగా 45 ఏళ్లకే పింఛన్ ఇస్తానని హామీ ఇచ్చారు. వైయస్ జగన్ ప్రకటనపై ఆంధ్ర ప్రజానీకమంతా హర్షం వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లను ఎడాపెడా కత్తిరించేశారు. అన్ని అర్హతలున్నా బాబు పాలనలో పేదలకు పెన్షన్ అందడం లేదు. ఈ సందర్భంగా పేదల కష్టాలను స్వయంగా తెలుసుకున్న వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక వారిని ఆదుకునేందుకు పెన్షన్ వయసును కుదించారు.  

మనసున్న నేత దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగా మీ అన్న ముఖ్యమంత్రి అవుతాడు, అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బిసి,మైనార్టీ (బడుగు బలహీన వర్గాల ) పేదలందరికీ 45 ఏళ్లకే  పింఛన్లు ఇస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. పింఛన్‌ కూడా రూ.2 వేలు ఇస్తానని మాటిచ్చారు.

Back to Top