ఇఫ్తార్ విందుకు వైయస్ జగన్

వైయస్సార్ జిల్లాః రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 5వ తేదీన వైయస్సార్ కడపలో జరిగే ఇఫ్తార్ విందుకు ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతున్నారు. కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా నేతృత్వంలో  కువైట్ ప్రతినిధుల బృందం వైయస్ జగన్‌ను ఆయన నివాసంలో కలసి ఈ విందుకు ఆహ్వానించింది. 

వైయస్సార్ కాంగ్రెస్ గల్ఫ్ కన్వీనర్ బి.హెచ్ ఇలియాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మేడపాటి వెంకట్,  కువైట్ కమిటీ సభ్యులు దుగ్గి గంగాధర్, సుబ్రమణ్యం రెడ్డి, ఎన్నారై షేక్ నాసర్, జి.ఎస్.బాబు రాయుడు, ఎస్. మున్నా, అజ్మత్, జఫరుల్లా ఈ బృందంలో ఉన్నారు.
Back to Top