గుడిని..లింగాన్ని మింగేసిన ఘనత చంద్రబాబుదే

కృష్ణా జిల్లా: గుడిని, గుడిలో లింగాన్ని మింగేసిన ఘనత చంద్రబాబుదే వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలతో పాటు దేవుళ్లకు రక్షణకరువైందని ఆయన మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గన్నవరంలో బ్రహ్మలింగయ్య చెరువును వైయస్‌ జగన్‌ పరిశీలించారు. నీరు చెట్టు కింద ఇసుక, మట్టిని అక్రమంగా టీడీపీ నేతలు తరలిస్తున్నారని, ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. నీరు–చెట్టు పథకం కింద టీడీపీ నేతలు రూ.కోట్లు కొల్లగొడుతున్నారని వైయస్‌ జగన్‌ మండిపడ్డారు. కింది స్థాయి నుంచి లోకేష్, చంద్రబాబు వరకు కమీషన్లు వెళ్తున్నాయని విమర్శించారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నా టీడీపీ తతేలు దుర్మార్గంగా మట్టిని తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్టి తవ్వెందుకు దేవాలయం అడ్డు వస్తుందంటే అందులో ఉన్న విగ్రహాలను రాత్రికి రాత్రే తరలించారన్నారు.  రాష్ట్రంలో ప్రతి చెరువు పరిస్థితి ఇంతే ఉందన్నారు. మట్టితో వ్యాపారం ఎలా చేయాలో చంద్రబాబు చూసి నేర్చుకుంటున్నారన్నారు. సీఎం క్యాంపు ఆఫీస్‌కు 35 కిలోమీటర్ల దూరంలో ఇసుక దోపిడీ జరుగుతుంటే ఇక రాష్ట్రం ఎలా బాగుపడుందని వైయస్‌ జగన్‌ మండిపడ్డారు. చివరకు దేవుళ్లను కూడా గుళ్లలో ఉండనీయడం లేదన్నారు. రాష్ట్రాన్ని స్కామ్‌ ఆంధ్రప్రదేశ్‌గా చంద్రబాబు మార్చేశారని విమర్శించారు. నేను వస్తున్నానని తెలిసి ఈ రోజు తాత్కాలిక పనిని నిలిపివేశారన్నారు. రోజు వందల కొద్ది లారీలతో ఇసుక, మట్టి అక్రమంగా తరలిస్తు గుడిని, గుడిలో లింగాన్ని మింగేసిన ఘనత చంద్రబాబుదే అని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో ప్రజలకు, దేవుళ్లకు రక్షణ కరువైందని వైయస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు. 
 
Back to Top