ఇంకెంత కాలం పోలీసు వ్య‌వ‌స్థ‌ను వాడుకుంటారు?

తూర్పు గోదావ‌రి:  గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న అక్ర‌మ మైనింగ్‌ను ప‌రిశీలించేందుకు వెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ స‌భ్యుల‌ను అక్ర‌మంగా అరెస్టు చేయ‌డాన్ని వైయ‌స్ జ‌గ‌న్ తీవ్రంగా ఖండించారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆయ‌న ట్వీట్ చేశారు. గురజాలలో సాగుతున్న మైనింగ్ కుంభకోణాన్ని పరిశీలించడానికి వెళ్లిన తమ పార్టీ నిజనిర్దారణ కమిటీ సభ్యులను అక్రమంగా అరెస్టు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు, గురజాలలో సెక్షన్‌ 144 విధింపు వంటివి.. మైనింగ్‌ కుంభకోణంలో నిందితులు ఎవరో చెప్పకనే చెప్తున్నాయని ట్విటర్‌లో పేర్కొన్నారు. మీ కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికి, అక్రమాలపై నినదిస్తున్న గొంతుకలను అణచివేయడానికి ఎంతకాలం ఇలా క్రూరంగా పోలీసుబలాన్ని ప్రయోగిస్తారని సీఎం చంద్రబాబును వైఎస్‌ జగన్‌ నిలదీశారు.
Back to Top