మ‌హాధ‌ర్నాకు మ‌ద్ద‌తిచ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు


 ప్ర‌కాశం:  ప్రత్యేక హోదా సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీ వేదికగా వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన మహాధర్నాకు మ‌ద్ద‌తిచ్చిన ప్ర‌తి ఒక్క‌రికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయ‌కుల‌కు, సీపీఎం, సీపీఐ, ఆప్ నేత‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. 

‘‘ఢిల్లీ ధర్నాలో పాల్గొన్న వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, సీపీఐ, సీపీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు.. ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాధాలు. ప్రధాని మోదీగారు ఈ ఆందోళనలను పరిగణలోకి తీసుకుని, ఏపీ హక్కు ప్రత్యేక హోదా ప్రతిపత్తిని కల్పిస్తారనే నమ్మకముంది’’ అని వైయస్ జగన్‌ ట్వీట్‌ చేశారు.  

Back to Top