బాబుకు పిచ్చెక్కింది




– చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతారు
 – ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాటలు చిత్తశుద్ధితో లేవు
– ప్రత్యేక హోదాపై వెంకయ్య ఏం మాట్లాడారో గుర్తుకు తెచ్చుకోండి
–  బాబుకు జ్ఞాపకశక్తి తగ్గింది..ఒక్కసారి మెంటల్‌ ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకో
– హెరిటేజ్‌ కంపెనీ షేర్లు పెరగడం అభివృద్ధా?
– వలసల సంఖ్య పెరుగుతుంటే దీనిని అభివృద్ధి అంటారా? 
– అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదు.
– కో–ఆపరేటివ్‌ ఫ్యాక్టరీలు మూతపడటానికి చంద్రబాబే కారణం
– మనందరి ప్రభుత్వం రాగానే రాయల్టీపై 40 శాతం సబ్సిడీ ఇస్తాం.
– కరెంటు చార్జీలు రూ.7.35 నుంచి 3.75 పైసలకు తగ్గిస్తాం
– డ్వాక్రా రుణాలు నాలుగు దఫాల్లో చెల్లిస్తాం..
– పొదుపు సంఘాలకు పావలా వడ్డీకే రుణాలు
– ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు
 
ప్రకాశం: చంద్రబాబు నాయుడు కు పిచ్చెక్కిందని, అందుకో పూటకో మాట మాట్లాడుతున్నారని, అసలు ఆయనకు మెదడు ఉందా అన్న అనుమానం కలుగుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. విభజన చట్టంలోని అంశాలు, హామీలపై చంద్రబాబు మాట్లాడుతున్న తీరు బాధాకరమన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాటలు చిత్తశుద్ధితో లేవని విమర్శించారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఏఒక్కరు సంతోషంగా లేరని, అందర్ని మోసం చేశారన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని వైయస్‌ జగన్‌ మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే.. 


అన్నా..మేమంతా నీ వెంటే..
ఉదయం నుంచి వేలాది మంది నాతో అడుగులో అడుగు వేశారు. ఎండలు తీక్షణంగా ఉన్నప్పటికీ ఏమాత్రం ఖాతరు చేయకుండా అడుగులో అడుగు వేశారు. ఒకవైపు వారికి ఉన్న బాధలపై అర్జీలు ఇస్తూ..మరో వైపు నా భుజాన్ని తడుతూ అన్నా..నీ వెంట మేమంతా ఉన్నామని అడుగులో అడుగు వేశారు. ఇలా నడి రోడ్డుపై నిల్చుండాల్సిన అవసరం ఎవరికి లేదు. ఎండలో నడవాల్సిన అవసరం ఎవరికి లేదు. చిక్కని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపుతున్నారు. ప్రేమానురాగాలు పంచుతున్నారు. మీ అందరికి ముందుగా చేతులు జోడించి, శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

దారి పొడవునా అందరిది ఒకే మాట..
దారి పొడవునా వేల మంది ఒకే ఒక మాట చెబుతూ వచ్చారు.దాదాపు జిల్లాలో రెండు వేలకు పైగా గ్రానైట్‌ ఫాలీసింగ్‌ యూనిట్లు ఉన్నారన్నా..ఇందులో లక్షమందికి పైగా బతుకుతున్నామన్నా..చంద్రబాబు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. లక్షల్లో ఉద్యోగాలు అంటారు. నెలకు ఒకసారి విదేశాలకు వెళ్తారన్నా..పోయినప్పుడల్లా ఏయిర్‌ బస్సు. బుల్లెట్‌ ట్రైన్‌ అంటారు. ఇక్కడ మా బతుకులు చూస్తే ఉన్న పరిశ్రమలు మూతపడుతున్నాయని పాలీషింగ్‌ యూనిట్‌ కార్మికులు చెబుతున్నారు. నాన్నగారి హాయంలో రాయల్టీ రూ.3 వేలు ఉంటే దాన్ని తగ్గించమని కోరితే దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌ రూ.1800లకు  తగ్గించారని గొప్పగా చెబుతున్నారు. 


బాబు పాలనలో బాదుడే బాదుడు..
చంద్రబాబు సీఎం కాగానే లక్షల్లో ఉద్యోగాలు అంటున్నారు. ఇక్కడేమో ఉన్న ఉపాధి కోల్పోతున్నామని చెబుతున్నారు. చంద్రబాబు హయాంలో రాయల్టీ రూ.4 వేలకు పైగా పెరిగిందన్నా అని చెబుతున్నారు. మరో వైపు పాలీషింగ్‌ యూనిట్లకు కరెంటు యూనిట్‌కు గతంలో రూ.3.75 ఉంటే చంద్రబాబు అయ్యాక రూ.7.35 పైసలకు పెంచారన్నా అని చెబుతున్నారు. రాయల్టీ, కరెంటు చార్జీల బాదుడుతో ఉన్న పరిశ్రమలు మూత వేస్తున్నామని చెబుతుంటే నిజంగా బాధనిపించింది. గ్రానైట్‌ ఫ్యాక్టరీ పెట్టిన ప్రతి ఒక్కరికి చెబుతున్నాను. మనందరి ప్రభుత్వం వచ్చాక ఫాలీషింగ్‌ ఫ్యాక్టరీలకు రాయల్టీ 40 శాతం ఇస్తామని హామీ ఇస్తున్నాను. కరెంటు చార్జీలు యూనిట్‌కు రూ.3.75 పైసలకు తగ్గిస్తామని చెబుతున్నాను. చదువుకున్న మన పిల్లలు ఉద్యోగాలు దొరక్క హైదరాబాద్, బెంగుళూరుకు వెళ్తున్నారు. ఉన్న పరిశ్రమలు మూతపడితే చదువుకున్న పిల్లలు ఎక్కడికి వెళ్తారని చంద్రబాబును నిలదీస్తున్నాను. 

ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం..
ఇక్కడ లక్షలాది మంది కార్మికులు ఈఎస్‌ఐ ఆసుపత్రి కావాలని కోరుతున్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో 40 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరితే చంద్రబాబు పట్టించుకోవడం లేదని కార్మికులు చెబుతున్నారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కచ్చితంగా ఇక్కడ మంచి ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని చెబుతున్నాను.

మిగిలిన 5 శాతం పనులు పూర్తి చేయడం లేదు..
పక్కనే గుండ్లకమ్మ ప్రాజెక్టు కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 95 శాతం పూర్తి కాగా, మిగిలిన ఐదు శాతం పనులు పూర్తి చేయకుండా చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారు. నాన్నగారి హయాంలో సుబాబుల్‌ రూ.4 వేలు మద్దతు ధర ఉండేదని, ఇవాళ రూ.1800 మించి కొనడం లేదంటున్నారు. 

దీన్ని అభివృద్ధి అంటారా?
నాలుగేళ్ల చంద్రబాబు పాలనను చూశారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయని చెబుతున్నారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు ఒక ఇంటర్వ్యూలో ఆయన అభివృద్ధి అన్నది మీకు కనబడటం లేదా అని చెబుతున్నారు. అభివృద్ధి అంటే నిన్నటి కన్న ఇవాళ బాగు ఉండటం అభివృద్ధి అంటాం. నాలుగేళ్ల చంద్రబాబు పాలనకు ముందు చూసిన పాలనకు, ఈ పాలనకు మధ్య చూడండి. అప్పుడు సంతోషంగా ఉన్నారా? ఇప్పుడు సంతోషంగా ఉన్నారా ఆలోచించండి. ఇవాళ అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. ప్రజలందరూ ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు మాత్రం ఈనాడు, ఎల్లోమీడియా పత్రికల్లో ఇంటర్య్వూలు ఇస్తున్నారు. అభివృద్ధిపై చంద్రబాబు తన గుండెలపై చెయ్యి వేసుకొని ఆలోచించమని అడుగుతున్నాను. నాలుగేళ్ల మీ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారా? అప్పుల పాలు అయ్యారా మీరే ఆలోచించమని అడుగుతున్నాను. రైతులకు గిట్టుబాటు ధర ఉందా అని అడుగుతున్నాను.  పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలకు వేలం నోటీసులు వస్తున్నాయి. మహిళలకు భద్రత ఉందా? వారి జీవితాలు మెరుగుపడ్డాయా? మద్యం ఏరులై పారిస్తూ మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు. చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా? ఉద్యోగాలు దొరక్క ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారు. గత నాలుగేళ్లుగా రూ.20 వేల కోట్ల పెట్టుబడులు కూడా మన రాష్ట్రానికి రాలేదు. కనీసం ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. విశాఖపట్నంలో సీఐఐ సదస్సులు పెట్టి రూ.40 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని అబద్ధాలు అడటం న్యాయమేనా? చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో లక్షల కొద్ది కూలీలు వలసలు వెళ్తున్నారు. దీన్ని అభివృద్ధి అంటారా అని అడుగుతున్నాను. కమీషన్లు, లంచాల కోసం రాజధానిలో భూములు బలవంతంగా లాక్కొని ఇష్టం వచ్చిన వ్యక్తులకు కట్టబెడుతున్నారు. పేదలకు ఒక్క ఎకరా అయినా ఇచ్చారా? కేసులకు భయపడి చంద్రబాబు హైదరాబాద్‌ వదలిపెట్టారు. నల్లధనంతో ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయిన సీఎం ఎవరైనా ఉన్నారా? చంద్రబాబు విదేశాల్లో మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? ఒక సీఎం నల్లధనంతో దొరికిపోయి ఇంకా ఆ పదవిలో కొనసాగుతున్నారని విదేశాల్లో అనుకుంటున్నారు. అయ్యా..మీ వీపు మీకు కనిపించడం లేదు. ఏదీ చూసినా కూడా టెంపరరీ సెక్రటెరెట్‌ అంటున్నారు. ఈ వ్యక్తి రాజధాని గురించి మాట్లాడుతున్నారు. ఏ సినిమా రిలీజ్‌ అయితే ఆ సినిమా సెట్టింగ్స్‌ బాగున్నాయి. అలా రాజధాని కడతా అని కథలు చెబుతున్నారు.  

ఆశ్చర్యమనిపిస్తుంది..
ఆయన దృíష్టిలో అభివృద్ధి అంటే హెరిటేజ్‌లో షేర్లు నాలుగు రేట్లు పెంచుకున్నారు. రూ.200 ఉన్న షేర్‌ రూ.1000 తీసుకెళ్తే దాన్ని అభివృద్ధి అంటారా చంద్రబాబూ? పూటకో మాట మాట్లాడుతున్న చంద్రబాబుకు అసలు మెదుడు ఉందా అని డౌట్‌వస్తుంది. మొన్నటి దాకా ప్రత్యేక హోదా సంజీవినా అని ఎదురు ప్రశ్నలు వేశారు. ఎన్నికలకు ముందు సంజీవని అన్నారు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తే ప్రత్యేక హోదా కోసం తాను కూడా పోరాటం చేస్తున్నట్లు బిల్డప్‌  ఇచ్చారు. నిన్న ఇంటర్వ్యూలో ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితం గురించి చెబుతూ..హోదాతో ఏం వస్తాయని మళ్లీ ఎదురు మాట చెబుతున్నారు. పోలవరానికి రూ.40 వేల కోట్లు రావు. లోటు బడ్జెట్‌కు డబ్బులు రావు అని చంద్రబాబు మాట్లాడుతుంటే ఆశ్చర్యమనిపిస్తుంది. ఇదే చంద్రబాబును గట్టిగా ప్రశ్నిస్తున్నాను. పరిశ్రమలకు రాయితీలు వస్తాయని కొందరు మభ్యపెడుతున్నారని చంద్రబాబు అంటున్నారు. చంద్రబాబు అన్న మాటలకు సమాధానం చెబుతున్నాను..వినయ్య చంద్రబాబు రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో ఈయనకు మద్దతిచ్చిన వెంకయ్యనాయుడు ఏమన్నారో వినండి. పరిశ్రమలు కట్టడానికి మూడేళ్లు పడుతుందని అన్నావు. తిరుపతిలో నరేంద్ర మోడీ ముందు చంద్రబాబు కూడా పరిశ్రమలు కట్టడానికి ఐదేళ్లు పడుతుంది, పదేళ్లు సరిపోదు..15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని అన్నది వాస్తవం కాదా? ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే పరిశ్రమలకు రాయితీలు ఇస్తారని మీకు తెలియదా? ప్రత్యేకంగా ఇచ్చే పారిశ్రామిక రాయితీలతో ఇన్‌కం ట్యాక్స్‌లు కట్టాల్సిన పని ఉండదు. జీఎస్టీ కట్టాల్సిన పని లేదంటే పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తారు. ఇలాంటి రాయితీలు ఇస్తారని చంద్రబాబుకు తెలుసు కాబట్టే తిరుపతిలో మాట్లాడారు.  రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో విభజన చట్టంలో కొన్ని హామీలు ఇచ్చారు. వాళ్లు ఇచ్చిన హామీలు చూసినా, విభజన చట్టంలోని అంశాలు చూసినా..పోలవరానికి ఎంత డబ్బు అయినా ఫర్వాలేదు..కేంద్రమే భరిస్తుందని చెప్పింది మీకు తెలియదా? వాళ్లతో పని చేయించకుండా ఆ ప్రాజెక్టును లంచాల కోసం చంద్రబాబు అడిగి తీసుకోవడం అన్యాయం కాదా? తన అవినీతితో పోలవరానికి సమాధి కడుతున్నారు. తనకు కావాల్సిన వ్యక్తులకు సబ్‌కాంట్రాక్టులు కట్టబెట్టారు. చంద్రబాబు తన కేబినెట్‌లోని మంత్రి యనమల రామకృష్ణుడు బంధువుకు సబ్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చారు. లోటు బడ్జెట్‌ కింద రూ.16 వేల కోట్లు రావు అని చంద్రబాబు అంటున్నారు. ముఖ్యమంత్రి కాగానే మీకు జ్ఞాపకశక్తి తక్కువైందేమో  చంద్రబాబు ఒకసారి పరీక్ష చేయించుకోవాలి. లేదంటే మెంటల్‌ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకో..ప్రధాని ఇచ్చిన హామీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో..రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో విభజన చట్టంలో కొన్ని అంశాలు పెట్టారు. అలాగే పార్లమెంట్‌లో ప్రధాని హామీ ఇచ్చారు. అందులో లోటు బడ్జెట్‌ పూర్తిగా భర్తీ చేస్తామన్న హామీ కూడా ఉంది అన్నది చంద్రబాబు గుర్తుకు తెచ్చుకోవాలి. 


మీకు తెలియదా?
ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు రెవెన్యూ డెఫ్షిట్‌ అంతా కూడా పూడ్చే పరిస్థితి ఉంటుంది. ఇవాళ చంద్రబాబుకు ఇవన్నీ తెలియక కాదా? చట్టం ఎక్కడ ఉంది. యాక్ట్‌ ఎక్కడ ఉంది అని తిక్క తిక్క ప్రశ్నలు అడుతున్నారు. జీఎస్టీ యాక్ట్‌లో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక రాయితీలు ఇస్తామన్న సంగతి మీకు తెలియదా అని అడుగుతున్నాను. నోరు తెరిస్తే చంద్రబాబు నోట్లో నుంచి అబద్ధాలు, మోసాలు వస్తున్నాయి. నాలుగేళ్ల హయాంలో పరిశ్రమలు ముందుకు వెళ్లాయా?మూత పడ్డాయో ఆలోచన చేయమని అడుగుతున్నాను. చీమకుర్తిలో గ్రానైట్‌ ఫ్యాక్టరీలు, కర్నూలులో నాపరాయి పరిశ్రమలు, చిత్తూరులో ఉన్న పరిశ్రమలు ఎందుకు మూత పడుతున్నాయో తెలుసుకో..కారణం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విఫరీతంగా రాయల్టీలు పెంచడం, కరెంటు బిల్లుల బాదుడే. చంద్రబాబు సీఎం అయ్యాక దగ్గరుండి సహకార రంగంలోని పరిశ్రమలు మూత వేయిస్తున్నారు. మీ జిల్లాలోనే ఒంగోలు డయిరీని మూత వేయించారు. పాడి ఉన్న ఇంట సిరులు పొంగునట అన్న సామెత ఉంది. అయితే చంద్రబాబుకు ఇది గుర్తుకు రాదు. తన హెరిటేజ్‌ డయిరీ లాభాల కోసం సహకార రంగంలోని డయిరీలను మూత వేయించారు. రైతులకు పాలు పోయించుకొని డబ్బులు ఇవ్వడం లేదు. తన సొంత జిల్లాలో చిత్తూరు షుగర్‌ ఫ్యాక్టరీలను మూత వేయించారు. మూత వేసిన ఫ్యాక్టరీలను వేలం వేస్తున్నారని, అందులో చంద్రబాబు బినామీలు ఉన్నారు.

గత ప్రభుత్వాలు వడ్డీ డబ్బులు చెల్లించేవి..
నాలుగేళ్ల క్రితం చంద్రబాబు సీఎం పదవి కోసం రైతుల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే చంద్రబాబు సీఎం కావాలన్నారు. ఆయన చేసిన రుణమాఫీ పథకం రైతుల వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. ఆయన చేసిన అన్యాయం ఏంటో తెలుసా..? గత ప్రభుత్వాలు రైతులు, పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేవి. ఆ వడ్డీ సొమ్ము ప్రభుత్వాలే కట్టేవి. చంద్రబాబు సీఎం కాగానే బ్యాంకులకు వడ్డీ సొమ్ము కట్టడం మానేశారు. బ్యాంకులు ముక్కు పిండి వడ్డీలు వసూలు చేస్తున్నారు. చంద్రబాబు తీరు వల్ల రైతులు, పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలు న ష్టపోయారు. చదువుకున్న పిల్లలను కూడా వదిలిపెట్టలేదు. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయి కాబట్టి..మోసం చేసేవాడు మీకు నాయకుడు కావాలా? అబద్ధాలు చెప్పేవాడు మీకు నాయకుడు కావాలా? పొరపాటున కూడా చంద్రబాబు అనే వ్యక్తిని క్షమించకండి..ఈయన్ను క్షమిస్తే రేపొద్దున చంద్రబాబు మీ వద్దకు వచ్చి పెద్ద పెద్ద అబద్ధాలు, పెద్ద పెద్ద మోసాలు చెబుతారు. రేపు పొద్దున ప్రతి ఒక్కరికి కేజీ బంగారం ఇస్తామంటారు. నమ్ముతారా? నమ్మరు కాబట్టి..బంగారానికి బోనస్‌గా ప్రతి ఇంటికి బెంజీ కారు ఇస్తామంటారు. అయినా నమ్మరు కాబట్టి..ప్రతి ఇంటికి మనిషిని పంపించి ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బులు పెడతారు. డబ్బులు ఇస్తే మాత్రం వద్దు అనకండి. రూ.5 వేలు గుంజండి..ఆ డబ్బు మనదే. మన జేబులో నుంచి దోచేసిన సొమ్మే. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనసాక్షి ప్రకారం ఓటు వేయండి. అబద్ధాలు చెప్పేవారు, మోసం చేసే వారు బంగాⶠఖాతంలో కలపండి. నాయకుడు ఏదైనా హామీ ఇచ్చి చేయకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. అప్పుడే ఈ చెడిపోయిన వ్యవస్థ బాగుపడుతుంది. ఇది జరగాలంటే వైయస్‌ జగన్‌కు మీ అందరి ఆశీస్సులు కావాలి. మీ అందరి తోడు కావాలి. 

మనందరి ప్రభుత్వం వచ్చాక..
రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చాక ఏం చేస్తామన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. పేదల ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు ఈ పథకాలు ప్రకటించాను. అందులోని అంశాలను ప్రతి మీటింగ్‌లో కొన్నింటిని చెబుతున్నాను. ఇవాళ పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మల గురించి చెబుతున్నాను. మíß ళలు లక్షాధికారులు కావాలని, వాళ్ల కాళ్ల మీద వారు నిలబడాలని దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి డ్వాక్రా సంఘాలకు పావలా వడ్డీకి, సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చారు. చంద్రబాబు సీఎం పదవి కోసం పొదుపు రుణాలు మాఫీ చేస్తానని అబద్ధాలు చెప్పారు. ఇవాళ ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. ఇవాళ మోసం చేయడమే కాకుండా బ్యాంకులు ముక్కు పిండి పొదుపు సంఘాల నుంచి వడ్డీలు వసూలు చేస్తున్నాయి. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం రాగానే ఎన్నికల నాటికి ఎంతైతే అప్పు ఉంటుందో అ డబ్బంతా నాలుగు దఫాలుగా మీ చేతుల్లోనే పెడతాను. పొదుపు సంఘాలకు వడ్డీ డబ్బులు ఈ ప్రభుత్వం కట్టడం మానేసింది. కాబట్టి ఏ బ్యాంకు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం లేదు. మన ప్రభుత్వం వచ్చాక వడ్డీ డబ్బులు బ్యాంకులకు కట్టి వడ్డీ లేని రుణాలు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. 


ఇంటిని అక్కా చెల్లమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌..
చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం, ఇల్లు కట్టిస్తామన్నారు.  కనీసం ఒక్క ఇల్లైనా కట్టించాడా? . ఒక్కసారి నాన్నగారి పాలనను గుర్తుకు తెచ్చుకొండి. నాన్నగారి ఐదేళ్ల పాలనలో 48 లక్షల ఇల్లు కట్టి ప్రతి పేదవాడికి తోడుగా ఉన్నారు. నాన్నగారు పేదవారి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే..ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తానని మాట ఇస్తున్నాను. ప్రతి పేద వాడికి ఇల్లు కట్టించి ఇస్తాను. అంతేకాదు ఆ ఇంటిని అక్క చెల్లెమ్మల పేరుతో రిజిష్టే్రషన్‌ చేయిస్తాను. అప్పుడు ఆ ఇల్లు అక్క చెల్లెమ్మలకు ఆస్తి అవుతుంది. డబ్బు అవసరం వచ్చినప్పుడు ఆ ఇంటిని బ్యాంకులో పెడితే పావలా వడ్డీకే రుణం వచ్చేలా చూస్తాం. నవరత్నాలపై ఏదైనా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే మీ అందరికి తెలుసు..నేను ఎక్కడ పడుకుంటున్నానో, ఎక్కడ ఉంటున్నానో మీ అందరికి తెలుసు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని ప్రతి ఒక్కరిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.








 
Back to Top