బాబుకు దేవుడంటే భయమూ లేదు..భక్తీ లేదు– బ్రాహ్మణులు పేదరికంలో అల్లాడుతున్నారు
– అర్చక వృత్తి కడుపుకు భోజనం పెట్టలేని స్థితిలో ఉంది
– పూజలకు రూ.5 వేల కైంకర్య ఇస్తామన్నారు
– బ్రాహ్మణులకు బాబు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు
– రమణదీక్షితులతో బలవంతంగా పదవీ విరమణ చేయించారు
– కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు చేశారు
– పుష్కరాల పేరుతో రూ.3200 కోట్లు దోచేశారు
– అర్చకుల వారసత్వ హక్కులకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారు
 


విశాఖ: ముఖ్యమంత్రి చంద్రబాబుకు దేవుడంటే భయమూ లేదని, భక్తీ లేదని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు పాలనలో బ్రాహ్మణులకు సముచితస్థానం కల్పించకపోగా అగౌరవపరుస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, పుష్కరాల పేరుతో రూ.3200 కోట్లు దోచేశారని ధ్వజమెత్తారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా విశాఖనగరంలోని సిరిపురం జంక్షన్‌లో ఏర్పాటు చేసిన బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..

విశాఖపట్నంలో ఈ రోజు బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ఇప్పటికే పలువురు బ్రాహ్మణ సోదరులు పలు సూచనలు ఇచ్చారు. వాటిని స్వీకరిస్తున్నాను. మీరు ఇచ్చే సలహాలు, సూచనలు తీసుకుంటాను. ఇది మొదలుపెట్టే ముందుకు క్లుప్తంగా కొన్ని విషయాలను చెబుతాను. 

– ఇవాళ నేను ఒకటి చాలా బలంగా నమ్ముతాను. రాజకీయ వ్యవస్థగానీ, ప్రజలు కానీ, ఎవరైనా కూడా బాగుండాలంటే దానికి ఒకటి కచ్చితంగా చేయాలి. మొట్ట మొదటగా ప్రతి మనిషిలోనూ మనసు అన్నది ఒక్కటి ఉంటుంది. తప్పు చేసినప్పుడు ఈ మనసు మనిషితో మాట్లాడుతుంది. తప్పు చేసినప్పుడు ఆ మనసు మాట్లాడుతుంది. తప్పు చేసినప్పుడు ఆ మనసు మాట వినగలితే ఆ తప్పు చేయడు. మనసు చెప్పే మాటను మనిషిని వినడం మానేస్తుందో, ఆ తప్పును సమర్ధించుకోవడం మొదలుపెడతారో అప్పుడు మనషులు భ్రష్టు పడుతాడు. మనిషి తప్పు చేయకుండా ఉండేందుకు మనిషి తప్పని సరిగా దేవుడిని నమ్మాలి. మనిషి, దేవుడికి మధ్య వారధిగా ఉండే గుడిలో అర్చకులు, చర్చిలో పాస్టర్, మసీదులో ఇమామ్‌లు అంటారు. ఎవరిని తీసుకున్నా కూడా వీళ్లంతా కూడా దేవుడికి, మనిషికి వారధులు. వీళ్లు అందరూ కూడా సంతోషంగా ఉంటేనే మనల్ని దేవుడి వద్దకు తీసుకెళ్లేందుకు సంతోషంగా పనిచేస్తారు. 
– బ్రాహ్మణుల సమస్యలను గమనిస్తే బాధనిపిస్తుంది. నాకున్న అవగాహనతో చెప్పాల్సి వస్తే వీరి పరిస్థితి దాయనీయంగా ఉంది. పేదరికంతో బ్రాహ్మణులు అల్లాడుతున్నారు. చదువులు దేవుడిచిన వరం వీరిది. చదువుకున్నా కూడా వీరికి ఉద్యోగాలు రావడం లేదు. అర్చక వృత్తిని చేసినా కూడా వారు ఈ వృత్తిని ఎందుకు చేస్తున్నామని ఆందోళనలో ఉన్నారు. ఈ వృత్తి కడుపుకు భోజనం పెట్టడం లేదు. మచంచి చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ముందడగు వేసే ముందు  ఇవాళ ఉన్ను పాలన గురించి చెప్పాలి.
– నాలుగేళ్ల చంద్రబాబు పాలన గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఫొటోకు ఫోజులు ఇచ్చి , ఎన్నికల ప్రణాళిక అట్టహాసంగా విడుదల చేశారు. నిజంగా టీడీపీ మేనిఫెస్టోలో ప్రతికులానికి ఒక పేజీ కేటాయించారు. బ్రాహ్మణ సామాజికవర్గానికి సంబంధించి చంద్రబాబు ఏం చెప్పారంటే..ఎన్నికల ప్రణాళికలో బ్రాహ్మణులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా చంద్రబాబు నెరవేర్చలేదు. 
– ఆర్థిక స్థోమత లేని పూజారులకు నెలకు రూ.5 వేల గౌరవవేతనం ఇస్తామన్నారు. ఆ రోజుల్లో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడి హయాంలో 14 వేల గుడులకు ధూపదీప నైవేద్యాలకు ప్రత్యేక పథకం ఏర్పాటు చేసి బ్రాహ్మణులకు తోడుగా ఉండేవారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత 14 వేల గుడులను 3 వేలకు తగ్గించారు. మంచి చేయాల్సింది పోయి, మంచి చేస్తానని చెప్పి మోసం చేశారు. 
–60 సంవత్సరాలు దాటిని పేద బ్రాహ్మణులకు ఆయుస్మాన్‌ భవ పథకం పేరుతో పింఛన్‌ ఇస్తామన్నారు. 65 సంవత్సరాలు ఉన్న బ్రాహ్మణులకు కూడా ఈ ప్రభుత్వం పింఛన్‌ ఇవ్వడం లేదు. చాలా మందికి పింఛన్లు రావడం లేదని దారి పొడవునా చెప్పుకొస్తున్నారు.
– అర్హులైన పేదలకు ఇంటి స్థలం, ఇల్లు ఇస్తామన్నారు. కనీసం ఒక్కరికైనా ఇచ్చారా?
– శివార్చకులను బీసీ–డీ కింద గుర్తించి చట్ట సవరణ చేస్తామన్నారు. ఇంతవరకు ఈ హామీ చంద్రబాబుకు గుర్తుకు రాలేదు. 
– దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు, ఇతరులకు ఈనామ్‌ భూములు అనుభవించే హక్కును కొనసాగిస్తామన్నారు. ఇక్కడ చంద్రబాబు చేసేది ఏముంది? బ్రాహ్మణులకు పెద్ద మేలు చేస్తున్నట్లు తన మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
– దేవాలయంలోని అర్చకులకు పదవీ విరమణ ఉండదన్నారు. ఆ తరువాత రమణదీక్షితులు విషయంలో చంద్రబాబు ఏం చేశారు. ఏకంగా జీవో తెచ్చి బలవంతంగా పదవీ విరమణ చేయించిన సంఘటన చూస్తున్నాం. ఆ రోజుల్లో నాన్నగారు ఎండోమెంట్‌ చట్టాన్ని సవరణ చేసి వంశపార్యంపరం చేశారు. ఆ చట్టానికి చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారు. బ్రాహ్మణులు అర్చక వృత్తి చేయకుండా ఉండేలా తూట్లు పొడుస్తున్నారు. బ్రాహ్మణులను చంద్రబాబు అగౌరవపరుస్తు ఉద్యోగాల నుంచి తొలగించారు.
– విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్లు, స్కాలర్‌షిపులు రూ.3 లక్షల దాకా పెంచుతానని చెప్పారు. దగ్గరుండి కాలేజీ ఫీజులు పెంచిస్తున్నారు. ఫీజులకు రెక్కలొస్తున్నాయి. చంద్రబాబు ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ముస్టి వేసినట్లు వేస్తున్నారు. అది కూడా రెండేళ్లుగా ఇవ్వడం లేదని నా వద్దకు వచ్చి చెబుతున్నారు. 
– దేవాలయాలకు సంబంధించిన ఆస్తులను పరిరక్షిస్తానని చంద్రబాబు తన మేనిఫెస్టోలో చెప్పారు. ఈయన చెప్పేది ఒక్కటి చేసేది మరొకటి. కనకదుర్గమ్మ భూములను సిద్ధార్థ అనే ప్రయివేట్‌ కాలేజీకి ఎకరానికి ఏడాదికి రూ.1 లక్ష చొప్పున 33 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. ఇదీ ఆయన చేస్తున్న పరిరక్షణ. సదావర్తి గుడి భూములను ఎకరాకు రూ.27 లక్షల చొప్పున కట్టబెట్టారు. ఈ భూములపై వైయస్‌ఆర్‌సీపీ న్యాయపోరాటం చేసింది. గుడికి సంబంధించిన ఆస్తులను పరిరక్షించడం అంటే ఇదేనా? చంద్రబాబు చెప్పిన ప్రతి హామీకి తూట్లు పొడిచారు. 
–చంద్రబాబు చెప్పిన మొట్టమొదటి హామీ..రూ.500 కోట్లతో బ్రాహ్మణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. నాలుగేళ్ల పాలనలో అక్షరాల రూ. 165 కోట్లు మాత్రమే. ఎక్కడ రూ.500 కోట్లు, ఎక్కడా రూ.165 కోట్లు ఒక్కసారి ఆలోచన  చేయండి. ఇందులోనే ఉపకార వేతనాలు, పింఛన్‌ నిధులు ఇందులో నుంచేనట. ఇంతదారుణంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. గుyì లో దేవుడన్న భక్తి లేదు..భయం లేదు. ఈ రెండు లేని వ్యక్తి, కళ్లు ఆర్పకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి ఒక్క చంద్రబాబు ఒక్కరే. గుడికి సంబంధించి మోసం చేయాలంటే ఎంతటి అన్యాయస్తుడైన భయపడుతారు. పుష్కరాల పేరుతో రూ.3200 కోట్లు దోచేశారు. ఇష్టానుసారంగా కమీషన్లు తీసుకొని నామినేషన్‌ పద్ధతిలో దోచేశారు. 
– ఇవాళ విజయవాడ దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు జరగడం చూశాం. ఇదే పెద్ద మనిషి హయాంలో గుడులలో శుభ్రం చేసే పనుల్లో కూడా ఇష్టానుసారంగా రేట్లు పెంచి తన బంధువులకు పనులు కేటాయిస్తున్నారు. చంద్రబాబు సీఎం కాకముందు అన్నవరం దేవస్థానంలో నెలకు రూ.7 లక్షలు ఖర్చు చేసేవారు. తన బంధువు భాస్కర్‌నాయుడుకు కాంట్రాక్ట్‌ అప్పగించి నెలకు రూ.32 లక్షలకు పెంచి ఇచ్చారు. అక్కడ కూడా కమీషన్లు తీసుకుంటున్న పరిస్థితి దేశంలో ఎక్కడా ఉండరేమో?
– ఐవీఆర్‌ కృష్ణారావు, రమణదీక్షితులు గురించి చెప్పాల్సిన పని లేదు. వాళ్లిదరికి జరిగిన అవమానం నిజంగా జీర్ణించుకోలేము. చివరకు తిరుపతిలో ఏ స్థాయికి వెళ్లిందంటే ..హుండిలోని కానుకలు, నగలు కూడా మాయం అవుతున్నాయన్న పరిస్థితిలో ఈ వ్యవస్థ దిగజారింది.
– రేపు పొద్దున దేవుడు అశీర్వదించి, మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మనం ఏం చేస్తే బాగుంటుందన్న అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వమని అందరిని కోరుతున్నాను. మీరే సలహాలు ఇవ్వండి. ప్రతి సూచనలు స్వీకరిస్తాను. సాధ్యాసాధ్యాలను పరిశీలించి మేలు చేస్తానని మాట ఇస్తున్నాను.
 
మీ అందరి ముఖాల్లో సంతోషం నింపుతా
బ్రాహ్మణుల ముఖాల్లో సంతోషం నింపుతానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.  ఇవాళ మాట్లాడిన వారు సలహాలు, సూచనలు ఇచ్చారు. అన్ని కూడికరించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి, వీలైనంత మంచి చేసేందుకు చర్యలు తీసుకుంటాను. మీ అందరి ముఖాల్లో సంతోషం చూసేలా చర్యలు తీసుకుంటాను. చంద్రబాబు  ఇచ్చిన హామీలను ఏవీ కూడా నెరవేర్చని పరిస్థితిలో అందరికి ఒక్కటే చెబుతున్నాను. మీరు అడిగిన ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటానని హామీ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.


 
 
Back to Top