మహాధర్నా ప్రారంభం..జననేతకు జనం జేజేలు

అనంతపురంః  ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ జిల్లా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ఈసందర్భంగా జననేతకు పార్టీనేతలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. కరువుతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఈనేపథ్యంలో అన్నదాతకు అండగా నిలిచేందుకు వైయస్ జగన్ మహాధర్నా చేపట్టారు.


జననేతకు జనం జేజేలు పలికారు. జైజగన్ నినాదాలతో ధర్నా ప్రాంగణం హోరెత్తింది.  ధర్నా వేదిక వద్దకు చేరుకున్న వైయస్ జగన్ తొలుత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రైతులతో కలిసి మహాధర్నాలో పాల్గొన్నారు. రైతులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. రైతులపై ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వైయస్ జగన్ ఎండగట్టనున్నారు. 
Back to Top