మంచినీరు ఇవ్వలేని చేత కాని ప్రభుత్వం



- కొప్పర్రులో మ‌హిళ‌ల‌తో క‌లిసి వైయ‌స్  జ‌గ‌న్ ఆందోళ‌న‌
ప‌శ్చిమ గోదావ‌రి:  2014 ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు సంబంధించి 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేల‌ను గెలిపిస్తే..ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు క‌నీసం మంచినీళ్లైనా ఇవ్వ‌లేవా బాబూ అని వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 176వ రోజు బుధ‌వారం కొప్పర్రు  గ్రామంలో మ‌హిళ‌లు నీటి స‌మ‌స్య‌ను వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. తాగునీటిని బాటిళ్ల‌లో తీసుకొచ్చి జ‌న‌నేత‌కు చూపించారు. చ‌లించిన వైయ‌స్ జ‌గ‌న్ మ‌హిళ‌ల‌తో క‌లిసిన ఖాళీ బిందెల‌తో ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..గోదావ‌రి జిల్లా వాసుల‌కు గుక్కెడు మంచినీళ్లు దొరక్క అల్లాడుతున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మంచినీటి చెర్వుల్లోని నీళ్లు పసర్లు పట్టి దుర్వాసన కొడుతున్నాయి. అనారోగ్యం పాలవుతున్నాని తెలిపారు. ఈ జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న సంద‌ర్భంగా 5 సార్లు ఇలాంటి నీటిని చంద్ర‌బాబుకు చూపించినా ఆయ‌న‌లో ఎలాంటి చ‌ల‌నం లేద‌ని మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల‌కు మంచినీళ్లు ఇవ్వ‌లేని ప్ర‌భుత్వం ఉన్నా లేన‌ట్లే అన్నారు.  ఈ గ్రామాల్లో మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హామీ ఇచ్చారు. అందరి ఆశీర్విదంతో మన ప్రభుత్వం రాగానే గోదావ‌రి జిల్లా వాసుల‌కు మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. వైయ‌స్ జ‌గ‌న్ హామీతో స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.
Back to Top