గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తాం..

శ్రీకాకుళంః  ఆదివాసీలు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.వైయస్‌ జగన్‌ నేలపై కూర్చొని వారి సమస్యలను ఓపికగా విని తెలుసుకున్నారు.మెళియపుట్టి మండల కేంద్రంలో మినీ ఐటిడిఏ నిర్మించాలి.ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున సెలవు ప్రకటించాలని కోరారు.ఐటిడిఏ ద్వారా గిరిజనుల కోసం స్పెషల్‌ డిఎస్సీ నిర్వహించాలని కోరారు.పోడు వ్యవసాయానికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలని వైయస్‌ జగన్‌కు వినతిపత్రం సమర్పించారు.సావధానంగా అన్ని సమస్యలు తెలుసుకున్న జననేత సాధ్యమైనవనీ చేస్తామని  హామీ ఇచ్చారు.గ్రామ సెక్రటేరియట్ల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.ఆదివాసీలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.టీడీపీ పాలనలో ఏం  కావాలన్నా  అంతా లంచాలమయం అయిపోయిందన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే గ్రామ సెక్రటేరియట్ల ద్వారా స్థానికులకే ఉద్యోగవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తామన్నారు. వాలంటీర్‌కు  5వేలు జీతం ఇస్తామన్నారు.వాలంటీర్లు ద్వారా సంక్షేమ పథకాలన్ని ఇంటివద్దకే వస్తాయని తెలిపారు. రెండు వ్యవస్థలు వలన దాదాపుగా ఐదున్నర లక్షల ఉద్యోగాలు కలుగుతాయన్నారు.ఏపీపీఎస్సీలో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, చంద్రబాబు ప్రభుత్వంలో ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయలేదన్నారు.వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నర లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఎకరం ఉన్నా,అర ఎకరం ఉన్నా  వ్యవసాయ పెట్టుబడికి 12 వేల రూపాయాలు ఇస్తామన్నారు. బోర్లు కూడా ఉచితంగా వేయిస్తాయన్నారు.

Back to Top