మహిళలకు వైయస్‌ జగన్‌ భరోసా: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తనను కలిసిన మహిళలకు భరోసా కల్పించారు. శనివారం రు. ఈ సందర్భంగా డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు మహిళలను మోసం చేశారని వివరించారు. ఇందుకు స్పందించిన వైయస్‌ జగన్‌ మహిళలకు భరోసా కల్పించారు. మన ప్రభుత్వం వచ్చాక మీ రుణాలన్నీ కూడా నాలుగు విడతల్లో మాఫీ చేస్తామన్నారు. వడ్డీ లేని రుణాలు ఇస్తామని మాట ఇచ్చారు. ఎన్నికల నాటికి ఎంతైతే అప్పు ఉందో అదంతా కూడా మాఫీ చేస్తామని చెప్పారు. చంద్రబాబు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని, మనం వచ్చాక అందరికి ఇల్లు కట్టిస్తామని, అన్న చెప్పాడని అందరికి చెప్పాలని ధైర్యం చెప్పారు.

రైతులకు తోడుగా ఉంటాం:
ప్రతి ఏటా మే నెలలో రైతు భరోసా పథకం కింద రూ.12500 ఇస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఏ పంటకు కూడా ఇప్పుడు గిట్టుబాటు ధర లేదని, మన ప్రభుత్వం వచ్చాక గిట్టుబాటు ధరలకు గ్యారంటీ ఇస్తూ..ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వమే పంటలు కొనుగోలు చేస్తుందని, మండలానికి ఒక కోల్డ్‌ స్టోరేజ్‌ ఏర్పాటు చేస్తామని, గిడ్డంగులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రత్యేక హోదా రావాలని దేవున్ని మొక్కాలని సూచించారు. 
 
Back to Top