అదే ఉత్సాహం..అదే స్ఫూర్తి



 - నిర్వీరామంగా కొన‌సాగుతున్న ప్రజాసంకల్పయాత్ర
- అడుగ‌డుగునా స‌మ‌స్య‌ల వెల్లువ 
- ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగుతున్న జ‌న‌నేత పాద‌యాత్ర‌

క‌ర్నూలు:  ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నిర్వీరామంగా కొన‌సాగుతోంది. న‌వంబ‌ర్ 6వ తేదీన వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ‌లో మొద‌లైన జ‌న‌నేత పాద‌యాత్ర ప్ర‌స్తుతం క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలో సాగుతోంది. మొద‌టి రోజు పాద‌యాత్ర ప్రారంభించిన‌ప్పుడు ఎలాంటి ఉత్సాహం ఉందో అదే ఉత్సాహంతో వైయ‌స్ జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను అడ్డుకోవాల‌ని, జ‌నాన్ని క‌ట్ట‌డి చేయాల‌ని అధికార పార్టీ చేస్తున్న కుట్ర‌లు జ‌నాభిమానం ముందు ప‌టాపంచ‌ల‌వుతున్నాయి. ఏ ఊరికి వెళ్లినా జనసంద్రమవుతోంది. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు. అభిమాన నేతతో కలిసి నడవాలని..కష్టాన్ని చెప్పుకోవాలని.. సంక్షేమ పథకాలు అందని తీరును వివరించాలని.. సుదూర ప్రాంతాల నుంచి  సైతం ప్రజలు భారీఎత్తున తరలివస్తున్నారు. రాజ‌న్న బిడ్డ‌ను చూడాల‌ని పోటి ప‌డుతున్నారు. తమ బాధ‌లు చెప్పుకోవాల‌ని ఆరాట‌ప‌డుతున్నారు. కొండంత అభిమానంతో వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రిని వైయ‌స్ జ‌గ‌న్ ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తూ, అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

స‌డ‌ల‌ని సంక‌ల్పం..
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇప్ప‌టి వ‌ర‌కు 22 రోజుల పాటు పాద‌యాత్ర చేప‌ట్ట‌డంతో పాదాలు కందిపోయాయి. బొబ్బ‌లెక్కి ర‌క్తం కారుతోంది. అయినా స‌రే ఆరోగ్యాన్ని లెక్క చేయ‌కుండా స‌డ‌ల‌ని సంక‌ల్పంతో ముంద‌డుగు వేస్తున్నారు. దారి పొడువునా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వింటూనే ప‌దండి..ముందుకు పదండి అంటూ యాత్ర కొన‌సాగిస్తున్నారు.  ఇప్ప‌టి వ‌ర‌కు వైయ‌స్ఆర్ జిల్లాలో యాత్ర ముగించికొని గ‌త నెల 14వ తేదీన క‌ర్నూలు జిల్లాకు ప్ర‌వేశించారు. జిల్లాలోని ఆళ్ల‌గ‌డ్డ‌, బ‌న‌గాన‌ప‌ల్లె, డోన్‌, ప‌త్తికొండ‌లోని రెండు మండ‌లాలు, కోడుమూరు, ఎమ్మిగ‌నూరు, ఆలూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో పాద‌యాత్ర పూర్తి చేశారు. తిరిగి ఇవాళ ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర పునఃప్రారంభించారు. జ‌న‌నేత  చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి భారీగా స్పందన లభిస్తోంది.  మహిళలు పెద్ద ఎత్తున జననేతను కలవడానికి వస్తున్నారు. అడుగడుగునా సమస్యలు విన్నవిస్తున్నారు. ఎక్కువగా పింఛన్లు రావడం లేదని, పక్కా గృహాలు కావాలని వైయ‌స్‌ జగన్‌ను కోరారు. పొలాల్లో పని చేసుకునే మహిళా కూలీలు రాజ‌న్న బిడ్డ‌ వస్తున్నారని తెలిసి ముందే రోడ్డుపైకి చేరుకుంటున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్ర ద్వారా తమ గ్రామాలకు రావడంతో పల్లె జనం సంబరపడుతున్నారు. అక్కచెల్లెళ్లయితే హారతులిస్తూ.. ఆహ్వానిస్తూ.. ఆశీర్వదిస్తూ.. నీరాజనాలు పలుకుతున్నారు. బిడ్డల్ని చంకనేసుకుని కొందరు.. కూలి పనులు మానుకుని మరికొందరు.. ఎర్రటి ఎండలో గంటల తరబడి ఎదురు చూస్తూ ఇంకొందరు.. ఇలా అడుగడుగునా జననేతకు స్వాగతం పలుకుతున్నారు. ప్ర‌జ‌ల సమస్యలను ఓర్పుగా వింటున్న వైయ‌స్‌ జగన్‌ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇస్తున్నారు. వైయ‌స్ జగన్‌ సీఎం అయితే తమ సమస్యలు తీరుస్తారని ప్రజలు విశ్వ‌సిస్తున్నారు.   

వైయ‌స్ జ‌గ‌న్ వెంటే నేత‌లు
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు భాగ‌స్వాముల‌వుతున్నారు. గురువారం కొనసాగిన పాదయాత్రలో ఎంపీలు విజయసాయిరెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, శాసన మండలి విపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు,  కర్నూలు జిల్లా రీజనల్‌ కోఆర్డినేటర్‌ మేకపాటి గౌతంరెడ్డి, కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, ఆలూరు, మంత్రాలయం, ఆదోని, నందికొట్కూరు ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం, బాలనాగిరెడ్డి, సాయిప్రసాదరెడ్డి, ఐజయ్య, పార్టీ నేతలు మురళీ మోహన్‌రెడ్డి, శ్రీనివాసులు, నారాయణస్వామి, జనార్దన్‌నాయుడు,  తేర్నేకల్‌ సురేందర్‌రెడ్డి, సీహెచ్‌ మద్దయ్య, పర్ల శ్రీధర్‌రెడ్డి, కర్నాటి పుల్లారెడ్డి, గంగుల ప్రహ్లాదరెడ్డి, ఎర్రబోతుల ఉదయ్‌భాస్కర్‌రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి, కురవ మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.    

Back to Top