సంగీత దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి మృతిపై జగన్ సంతాపం

హైదరాబాద్: సంగీత దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస చక్రవర్తి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంగీత దర్శకుడు శ్రీ శనివారం సాయంత్రం కొండాపూర్లోని స్వగృహంలో కన్నుమూశారు. శ్రీనివాస చక్రవర్తి, ప్రముఖ సంగీత దర్శకుడు దివంగత చక్రవర్తి  కుమారుడు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన శ్రీ గత కొద్ది కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్రీ  పోలీస్ బ్రదర్స్, గాయం, సింధూరం, అనగనగా ఒక రోజు, ఆడుమగాడ్రా బుజ్జీ, అమ్మోరు, మనీ, నీకే మనసిచ్చా, ఆవిడా మా ఆవిడే, లిటిల్ సోల్జర్స్, కాశీ, సాహసం తదితర 20 చిత్రాలకు సంగీతం అందించారు.
Back to Top