<strong> జనేనేతకు సమస్య చెప్పుకున్న వివిధ వర్గాల ప్రజలు..</strong>శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో వివిధ వర్గాల ప్రజలు వైయస్ జగన్‌ను కలిసి తమ చెప్పుకున్నారు.# సాక్షారభారత్ 50 మంది ఉద్యోగులను అకారణంగా తొలగించారని పొందూరు గ్రామానికి చెందిన ఎస్.రామారావ జననేతకు ఫిర్యాదు. ట్రామాకేర్ విభాగానికి చెందిన ఉద్యోగులు జగన్ కలిశారు. నాలుగు నెలలుగా జీతాలు రావడంలేని మొరపెట్టుకున్నారు. ఒడిశాకు చెందిన యువకుడు జగన్‌ను కలిశారు. జగన్ అంటే తనకు అభిమానమని, జగన్ సీఎం అయితే ఏపీ బాగుపడుతుందన్నారు. పొందూరు మండలం నందివాడ పంచాయతీ నర్సాపూర్ గ్రామమ ప్రజలు వైయస్ జగన్‌ను కలిశారు. నాగార్జున కెమికల్ ఫ్యాక్టరీ వల్ల 11 గ్రామాల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నామని తెలిపారు. మంచినీరు కలుషితమై చాలామంది కిడ్నీ వ్యాధులకు గురు అవుతున్నామన్నారు. వైయస్ జగన్‌ను సి.సిగడం గ్రామానికి చెందిన ఎం.నారాయణరావు కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. చేనేత సొసైటీలకు రావాల్సిన బకాయిలు రావడంలేని జగన్‌కు ఫిర్యాదు చేశారు. పొందూరు వైయస్‌ఆర్‌సీపీ నేత గాంధీజీ వైయస్ జగన్‌ను కలిసి టీడీపీ అరాచకాలు గురించి వివరించారు. వైయస్‌ఆర్‌సీపీకి చెందిన 800 మంది పెన్షన్లను జన్మభూమి కమిటీలు తొలగించాయన్నారు. 498 మంది పెన్షన్ల కోసం కోర్టును ఆశ్రయించారని, తొలగించిన 498 మంది ఒక్కొక్కరికి రూ.49వేల చొప్పున పెన్షన్ బకాయిలు ఇవ్వాల్సి ఉందన్నారు. మిగతవారి పెన్షన్ల కేసు ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉందని వివరించారు. పొందూరు మండలం కనిమెట్ట గ్రామానికి చెందిన జైభీం. యువజన సంఘం నేతలు వైయస్ జగన్‌ను కలిశారు. వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరులమని చెప్పి తమ గ్రామానికి వచ్చిన నిధులను జన్మభూమి కమిటీలు అడ్డుకుంటున్నాయని తెలిపారు.