వైయస్‌ జగన్‌ పాదయాత్ర చిరస్మరణీయం

విశాఖః వైయస్‌జగన్‌ పాదయాత్ర మరో చరిత్ర సృష్టించబోతుందని మాజీ ఎంపీ, వైయస్‌ఆర్‌సీపీ నేత వైవి సుబ్బారెడ్డి అన్నారు. జగన్‌ ప్రతిరోజూ ప్రత్యక్షంగా 5 నుంచి వేల మంది కలుస్తున్నారన్నారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయే పాదయాత్రగా అభివర్ణించారు. ప్రజా సమస్యలను అవగాహన చేసుకుని రాబోయే రోజుల్లో వారి సమస్యలు తీర్చే దిశగా జగన్‌ అడుగులు వేస్తున్నారన్నారు.మళ్లీ వైయస్‌ఆర్‌ సువర్ణయుగం వస్తుందన్నారు.
Back to Top