వైయస్‌ జగన్‌ను సన్మానించిన కాపు నేతలు


తూర్పు గోదావరి: కాపు రిజర్వేషన్లకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతిస్తుందని వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీ పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాపులకు రూ.10 వేల కోట్లు కేటాయిస్తానన్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కాపు నేతలు సన్మానించారు. కాపు కార్పొరేషన్‌ నిధులను రెట్టింపు చేస్తామని చెప్పడం సంతోషకరమని వారు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం పిఠాపురంలో కాపు నాయకులు కన్నబాబు ఆధ్వర్యంలో పూల బొకే ఇచ్చి, శాలువాతో సన్మానించారు. 
 
Back to Top