బాబుది బయట యుద్ధం..లోపల కాళ్ల బేరం
 
 – ప్రచారం తప్ప..చంద్రబాబు చేసింది ఏమీలేదు
– కాకినాడలో డంపింగ్‌ యార్డు మార్చమని అడుగుతుంటే పట్టించుకోవడం లేదు
– స్మార్ట్‌ సిటీ అభివృద్ధిలో కాకినాడది చివరి స్థానం
– కాకినాడ అర్బన్‌లో వైయస్‌ఆర్‌ హయాంలో 13 వేల ఇళ్లు కట్టించారు. 
– అమరావతిలో బాబు జిమ్మిక్కులు కనిపిస్తాయి
– ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కాదు..అది ఈజ్‌ ఆఫ్‌ కరెప్షన్‌
– అవినీతి,అబద్ధాలు, మోసాలు, దోపిడీలో బాబుది నంబర్‌ వన్‌ స్థానం
–   బుట్టా రేణుకను అఖిలపక్షానికి ఎందుకు పిలిచారో అర్థం కావడం లేదు
– రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ అన్యాయంగా విడగొట్టింది
– విభజన హామీలను కాంగ్రెస్‌ చట్టంలో పెట్టలేదు
– హోదా ఇచ్చే స్థానంలో బీజేపీ ఉండి ఇవ్వడం లేదు
– మీ దగ్గరున్న ఎంపీలతో ఏం ఒరగబెట్టావని బాబును నిలదీయండి
– ఏటా ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తాం
– గ్రామ సచివాలయాల్లో స్థానికులకే ఉద్యోగాలు 
– పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు 

తూర్పు గోదావరి: చంద్రబాబు బయటికి బీజేపీతో యుద్ధమంటూ ప్రగల్భాలు పలకడం..లోపల బీజేపీ నాయకుల కాళ్లపై పడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. కేంద్రంపై వైయస్‌ఆర్‌సీపీ ఎన్నిమార్లు అవిశ్వాస తీర్మానం పెట్టినా అంగీకరించకపోవడంతో రాజీనామాలు చేసి ఎంపీలు బయటకు వచ్చారని, టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టిన వెంటనే ఆమోదించడం ఆశ్చర్యకరమన్నారు.  నాలుగున్నరేళ్లలో చంద్రబాబు చేసిందంతా ప్రచార ఆర్భాటమే అని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీని నమ్మకండని, ప్రతి ఓటు వైయస్‌ఆర్‌సీపీకే వేయాలని వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. 
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కాకినాడ నగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..

–ఇవాళ పాదయాత్ర జరుగుతూ ఉంటే ఇక్కడి ప్రజలు నా వద్దకు వచ్చి అంటున్న మాటలు వింటుంటే ఆశ్చర్యపోయాను. ఈ జిల్లా నుంచి 19 నియోజకవర్గాల్లో 14 స్థానాలు టీడీపీకి కట్టబెట్టారు. అవి సరిపోవు అని సంతలో పశువులను కొన్నట్లుగా వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్నా ..17 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. చంద్రబాబు మా జిల్లాకు చేసింది ఏంటీ అన్నా..అని ఇక్కడి ప్రజలు అడుగుతున్నారు.
– ఇదే కాకినాడ నియోజకవర్గం కూడా చంద్రబాబుకు కట్టబెట్టామన్నా..మా కాకినాడుకు చంద్రబాబు చేసింది ఏంటన్నా అంటున్నారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అవినీతి, లంచగొండితనం, ప్రచార ఆర్భాటం కనిపిస్తుందని చెబుతున్నారు.కాకినాడ స్మార్ట్‌సిటీగా మారలేదని, అవినీతిమాత్రం చాలా స్మార్ట్‌గా చేస్తున్నారని చెబుతున్నారు.
– జన్మభూమి కమిటీల మాఫియాకుతోడు ఇక్కడి టీడీపీ నాయకులు ఆయిల్‌ మాఫియా చేస్తున్నారని చెబుతున్నారు. షిప్‌లకు వెళ్లే పైప్‌లైన్‌కు కూడా కన్నం పెట్టి ఆయిల్‌ దోచుకుంటురన్నా..నిజంగా గజదొంగల పరిపాలనకు కాకినాడే నిదర్శమంటున్నారు. 
– కాకినాడలో అయిల్‌ దొంగతనం కనిపిస్తుంటే..మాఫియాను అరికట్టాల్సిన పరిస్థితి ఎలా ఉందంటే..లంచాలు తీసుకుని పోలీసులకు పోస్టింగులు ఇప్పిస్తున్నారు. ప్రైవెట్, ఎడ్యూకేషన్‌ అస్తులు కబ్జా జరుగుతోంది. భూమి ఉంటే అది ఉంటుందా? లేదా అన్న భయంతో ప్రజలు బ్రతుకుతున్నారు. ఇక్కడ పుష్కలంగా పేకాట క్లబ్‌లు కనిపిస్తున్నాయి. ఇవాళ ఇంతటి దారుణంగా పరిపాలన సాగుతుందంటే..అన్నా..కార్పొరేషన్ల ద్వారా రుణాలంట అన్నా..అది కూడా అరకొరగా ఇస్తున్నారు. ఆ రుణాలు రావాలంటే లంచాలు ఇవ్వాల్సిందే అన్నా అంటున్నారు. 
– అన్నా..పక్కనే రూరల్‌ నియోజకవర్గంలో కూడా పరిస్థితి ఏంటంటే..ప్రతి దానికి ఓ రేటు ఉంది. నోటు ఇవ్వనిదే అడుగు పడటం లేదు. లే అవుట్‌ వేస్తే ఎకరాకు రూ.6 లక్షలు ఇవ్వకుంటే అప్రూవల్‌ ఇవ్వడం లేదు. లబ్ధిదారుల నుంచి వేలకు వేలు వసూలు చేస్తున్నారు. కమ్యూనిటీ స్థలాలు అమ్ముకొని టీడీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. నిజంగా ఇది ఒక పాలనా? ముఖ్యమంత్రి అనే వ్యక్తికి అవినీతి జరుగుతుందని తెలిస్తే భయం పుట్టాలి. కానీ ఇవాళ ఎంత దారుణంగా ఉందంటే..ముఖ్యమంత్రికి కూడా భాగం ఇస్తున్నామని చెబుతున్నారు.
– కాకినాడ స్మార్ట్‌ సిటీ అట. కాకినాడ స్మార్ట్‌గా ఉండాలంటే టీడీపీకి ఓటు వేయమని అడిగారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేయాలని అడిగారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. కాకినాడ స్మార్ట్‌ సిటీ అయ్యిందా? 
రాజకీయ నాయకులు మాత్రం చాలా స్మార్ట్‌గా తెలివి తేటలు పెరిగాయి. ఎన్నికలు మరో ఆరునెలల్లో వస్తున్నాయని విఫరీతంగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. నాలుగేళ్లు వీరికి డ్రైనేజీలు గుర్తుకు రాలేదు. బ్రిడ్జీలు గుర్తుకు రాలేదు. రోడ్లు, డంపింగ్‌ యార్డులు కూడా గుర్తుకు రాలేదు. ఇవాళ ఇదే స్మార్ట్‌సిటీకి ఏడాదికి రూ.200 కోట్లు ఇస్తారు. 20 స్మార్ట్‌ సిటీలు ఉన్నాయి. ఐదు సంవత్సరాల్లో కాకినాడకు రూ.1000 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. రూ.400 కోట్లు కేంద్రం నుంచి మంజూరైతే..కాకినాడలో మాత్రం రూ.50 కోట్లు కూడా ఖర్చు చేయలేదు..ఇంత అసమర్ధ ప్రభుత్వం అని చెప్పడానికి కాకినాడ నిదర్శనం కాదా?
– సర్వవరం నుంచి జగనాథపురం వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఏడు నెలలు అయినా ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. కాకినాడలో డంపింగ్‌ యార్డు కంపు కొడుతుందని, ఇక్కడి నుంచి మార్చమని ప్రజలు అడుగుతుంటే..నాలుగున్నరేళ్లు అవుతున్నా ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు. 
– ఆ రోజుల్లో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కాకినాడకు మంచినీళ్లు ఇచ్చేందుకు పనులు చేపట్టారు. మహానేత చనిపోయిన తరువాత ఆ మంచినీటి పథకం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. నాన్నగారి పాలనలో రెండు బ్రిడ్జిలు కట్టించారు. ఏటీమొగ్గ వద్ద చేపట్టిన బ్రిడ్జి పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి.
– జగన్నాథపురం కాల్వపై బ్రిడ్జి పనులు, అలైన్‌మెంట్‌ ఎన్నిసార్లు మార్చారో మీరందరూ చూస్తున్నారు. అక్షరాల రూ.140 కోట్లకు వాటి అంచనా పెంచారు. ఈ రోజుకు కూడా ఆ పనులు మొదలు కాలేదు.
– స్మార్ట్‌సిటీల పనితీరులో 20వ స్మార్ట్‌సిటీల్లో కాకినాడ చిట్టచివర ఉంది. అంత గొప్పగా చంద్రబాబు పాలన సాగుతోంది. ఇటీవల గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అని కొత్తగా తెచ్చారు. ఇది వచ్చిన తరువాత మన బతుకులు బాగుపడ్డాయా? నాశనమయ్యాయా ఆలోచించండి. లంచాలు అన్నవి పంచాయతీ స్థాయిలోనే ఉండేవి. ఇప్పుడు పంచాయతీకి ఇవ్వాలి, గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌కు  ఇవ్వాలి. ఇండస్ట్రియల్‌ జోన్‌లో రైతులు భూములు అమ్ముకోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎకరాకు ఇంత లంచం ఇస్తేనే అమ్ముకునే పరిస్థితి.
– కాకినాడ నగరంలో ఇక్కడి ప్రజలు ఏమంటున్నారే..ఆ రోజు నాన్నగారి పాలనలో కాకినాడ నగరంలోనే అక్షరాల 13 వేల ఇళ్లు కట్టించారని గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఒక్క ఇల్లైనా కట్టించారా? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు ఏం చేస్తున్నారో తెలుసా? వైయస్‌ఆర్‌ పేదల కోసం కేటాయించిన స్థలాలను తీసుకుని ఫ్లాట్లు కడుతానని వ్యాపారం చేస్తున్నారు. పేదవారి ఇళ్ల వద్ద కూడా అవినీతి చేసే వారిని ఏమనాలి? ఇంతకంటే సిగ్గు, ఎగ్గు ఉన్న వ్యక్తి మరొకరు ఉండరు. పేదవాడి ఇళ్ల నిర్మాణంలో కూడా చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారు. లంచాలు తీసుకునేది చంద్రబాబు..కంతులు కట్టాల్సింది పేదవారట. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి కాస్తో కూస్తో ప్లాట్లు ఇచ్చే కార్యక్రమాలు చేస్తారు. ఆ ప్లాట్లు తీసుకోండి. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ..ఆ ప్లాట్లపై మీకు ఉన్న అప్పును మాఫి చేస్తానని హామీ ఇస్తున్నా..ఎన్నికల వేళ ఏదైనా ఇస్తే బంగారంలా తీసుకోండి. వద్దనకండి.
– ఇదే కాకినాడ ఏరియా ఆసుపత్రిలో రోజుకు 3 వేల మంది రోగులకు వైద్యం అందించాలి. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే..ఎవరైనా గర్భిణి ఆసుపత్రికి వెళ్తే క్షేమంగా ఇంటికి వస్తుందా అన్న అనుమానం కలుగుతోంది. 500కు పైగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఇదే ఆసుపత్రిలో ఆరు నెలల క్రితం అక్షరాల 48 మంది అక్కచెల్లెమ్మలు కాన్పుల కోసం వెళ్లి చనిపోయిన పరిస్థితి చూశాం. కలెక్టర్‌ అనే వ్యక్తి ఆసుపత్రి తీరుపై విచారణ  చేయాలి. కానీ అలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకు చనిపోయారు అన్న విచారణ చేపట్టడం లేదు. ఇంతకన్న దారుణమైన పాలన ఎక్కడైనా ఉంటుందా? ఇక్కడ డాక్టర్ల కొరత ఉంది. కిడ్నీ పేషేంట్లకు డయాలసిస్‌ చేయడం లేదు. అక్కడ ¯ð ప్రాలజీస్టులు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఒకే బెడ్‌కు  ఇద్దరు పేషేంట్లను కేటాయిస్తున్నారు. ఇదే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను.
– పక్కనే తంగవరంలో ఏపీఐసీకి, రైతులకు మధ్య వివాదం జరుగుతోంది. అప్పుడు చంద్రబాబు డీ నోటిఫికేషన్‌ చేసి రైతులకు భూములు ఇస్తామన్నారు. ఇంతవరకు చంద్రబాబు ఆ రైతులను పట్టించుకోవడం లేదు. రైతులకు మార్కెట్‌రేటు ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం మానవత్వం లేకుండా పాలిస్తుంది.
– నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో మనం చూసింది ఏమిటి అంటే..అబద్ధాలు, మోసం, వెన్నుపోట్లు, అవినీతి ఇది చంద్రబాబు పాలన. ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు సింగపూర్‌  వెళ్లారు. ఈనాడు దినపత్రిక చూస్తే..అమరావతి రాజసం..అని రాతలు రాశారు. అంతర్జాతీయ నగరాల సదస్సు జరిగిందట. ఆ సదస్సుకు ముంబాయి, కలకత్తా, చెన్నై నగరాల నుంచి ఏ సీఎం కూడా హాజరుకాలేదు. కానీ మన చంద్రబాబును మాత్రమే పిలిచారట. 50 వేల ఎకరాల పంట భూములను గడ్డి భూములుగా మార్చి తన బినామీలకు భూములు అమ్మేస్తున్న చంద్రబాబును మాత్రమే సింగపూర్‌కు పిలిచారట. కట్టని, కనిపించని అమరావతి గురంచి ఈయన కోతలు కోస్తుంటే దుబాయి, సింగపూర్‌ వాళ్లు తమ నగరాల్లో ఉండటం వేస్టు అన్నట్లుగా భ్రమలు కల్పించారు. అమరావతిలో అట ఉద్యోగస్తులు కేవలం 15 నిమిషాల్లో అలా అలా నడుచుకుంటూ ఆఫీసుకు వెళ్లవచ్చు అన్నారు. 1400 సైకిళ్లు తొక్కేందుకు మార్గాలు ఉన్నాయట. 180 కిలోమీటర్ల మేరా రవాణాకు అవసరమైన కాల్వలు ఉన్నాయట. అక్కడి వాహనాలకు పొల్యూషనే ఉన్నాయట. ఆయన కోతలు కోస్తుంటే..ఆహా రాజధాని, ఓహో రాజధాని అంటూ ఈనాడులో రాతలు రాశారు. అమరావతి రాజసం అంటూ వార్తలు రాశారు. నాలుగేళ్లలో చంద్రబాబు అమరావతిలో పర్మినెంట్‌ పేరుతో ఒక్క  ఇటుక కూడా వేయలేదు. చంద్రబాబు ఎమ్మెల్యే గేదేలు అమరావతిలో గడ్డి మేస్తూ కనిపిస్తాయి. చంద్రబాబు బాహుబలి గ్రాఫిక్స్‌ కనిపిస్తాయి. అమరావతిలో చంద్రబాబు జిమ్మిక్కులు కనిపిస్తాయి. తనకు కావాల్సిన వాళ్లకు, తన బినామీలకు లంచాలు తీసుకుని భూములు కట్టబెట్టింది కనిపిస్తుంది. సింగపూర్‌ నుంచి చంద్రబాబు వచ్చి రాగానే..ఇక్కడ ఏమైందో తెలుసా..ఈనాడులో బ్యానర్‌ స్టోరీ..ఈజ్‌ ఆఫ్‌ డ్యూయింగ్‌ బిజినెస్‌లో ఏపీకి నంబర్‌వన్‌ స్థానమట. వర్డల్‌ బ్యాంకు వారు చంద్రబాబు పాలనను మెచ్చుకొని అవార్డు  ఇచ్చారట. ఇంతటితో ఆగలేదు. తన గొప్పతనం చూసి మనం అందరం ఆనందపడాలట. 
– ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో చంద్రబాబుకు నంబర్‌ వన్‌ ర్యాంకు ఎలా ఇచ్చారబ్బా అని బుద్ధి ఉన్నవార ఆలోచిస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ఊదరగొట్టారు. రూ.40 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఉద్యోగాలు లేక, రాక చదువుకున్న పిల్లలు ఎక్కడి వెళ్లాలో అర్థం కావడం లేదు. గత నాలుగేళ్లుగా మన రాష్ట్రంలో ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తాయో తెలుసుకోవడం కష్టం కాదు. డీప్‌ అనే వెబ్‌సైట్‌ వద్ద నొక్కితే మొత్తం డేటా తెలుస్తుంది. ప్రతి రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు వస్తాయని ఆ వెబ్‌సైట్లో ప్రకటిస్తారు. ఎవరైనా పరిశ్రమలు పెట్టాలంటే ఐఈఈఎం వద్ద దరఖాస్తు చేసుకోవాలి. ఏ బ్యాంకు కూడా అక్కడ దరఖాస్తు చేసుకున్న వారికే రుణం ఇస్తుంది. నాలుగేళ్లలో కనీసం 5 వేల కోట్ల పెట్టుబడులు కూడా రాలేదు. ఈ పెద్ద మనిషి మాత్రం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో అవార్డు వచ్చిందట..ఈనాడులో బ్యానర్‌ స్టోరీ.ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కాదు..ఈజ్‌ ఆఫ్‌ కరెప్షన్‌ జరుగుతుందని మూడు పెద్ద సంస్థలు ఏపీలో జరుగుతున్న అవినీతి ఎక్కడా జరగడం లేదని తేల్చాయి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో చంద్రబాబు అవార్డు ఇచ్చిన వారికి బుద్ధి ఉందా?. పరిశ్రమలకు రాయితీలు ఇవ్వాలి. చంద్రబాబు పరిశ్రమలకు బకాయిలు పెట్టారు. 
–  ఏ జిల్లా లో చూసినా కూడా పరిశ్రమలు మూతపడుతున్నాయి. కర్నూలు జిల్లాలో నాపరాయి పరిశ్రమలు మూతపడ్డాయి. కరెంటు బిల్లులు పెంచడంతో నాపరాయి పరిశ్రమలు మూతపడ్డాయి. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో గ్రైనెట్‌ పరిశ్రమలు మూతపడ్డాయి. ఫాలిషింగ్‌ యూనిట్లు మూతపడుతున్నాయి. చిత్తూరు, రేణిగుంట, గన్నవరం వంటి అన్ని చోట్ల సహాకార చెక్కర పరిశ్రమలు మూతపడ్డాయి. చిత్తూరు, ఒంగోలు డయిరీని మూత వేయించారు. ఆయిల్‌ ఫెడ్‌ లాంటి పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రకాశం జిల్లాలో 50 స్పిన్నింగ్‌ మిల్లులో పది మూతపడ్డాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో 14 జూట్‌మిల్లులు మూతపడుతున్నాయి. ఈయనేమో కొత్త పరిశ్రమలు వచ్చాయని ఊదరగొడుతున్నారు. ఇలాంటి వ్యక్తిని ఏమాలి?
– ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నంబర్‌ స్థానం వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు. ఆయనకు నంబర్‌ వన్‌ స్థానం ఎందులో వచ్చిందటే రైతులను, పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తామని మోసాలు చేయడంలో నంబర్‌వన్‌ స్థానం వచ్చింది. రైతులకు అన్యాయం చేయడంలో వచ్చింది. పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి నెల రూ.2 వేలు ఇస్తామని అబద్ధాలు చెప్పడంలో నంబర్‌ వన్‌ స్థానం వచ్చింది. ఆ ఉద్యోగాలు వస్తాయని తెలిసినా ఎన్నికలకు ముందు ఓ మాదిరిగా మాట్లాడి..ఎన్నికలు అయిపోయిన తరువాత ప్రత్యేక హోదా సంజీవనా? కోడలు మగబిడ్డను కంటే అత్త వద్దంటుందా అని నాలుగేళ్లు బిజేపీతో కలిసి తూట్లు పొడవడంలో నంబర్‌వన్‌ స్థానం వచ్చింది. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఐదుగురు రాజీనామాలు చేస్తే.. చంద్రబాబుకు సంబంధించిన ఎంపీలు ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయకుండా మోసం చేయడంలో నంబర్‌వన్‌ స్థానం వచ్చింది. అవసరమైనప్పుడు రాజీనామాలు చేయించకుండా మోసం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి గొప్ప పథకానికి తూట్లు పొడవడంలో నంబర్‌ వన్‌ స్థానం వచ్చింది. ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చినందుకు చంద్రబాబుకు నంబర్‌ వన్‌ స్థానం వచ్చింది. మన ఊర్లో, మన ఇంటి పక్కనే, గుడి పక్కనే మద్యం షాపు తెరిపించడంలో నంబర్‌వన్‌ స్థానం వచ్చింది. పెట్రోల్, డీజిల్, కరెంటు, ఆర్టీసీ చార్జీలు పెంచడంలో నంబర్‌ వన్‌ స్థానం వచ్చింది. ప్రతి కులానికి, ప్రతి వర్గానికి ఎన్నికల ప్రణాళికలో ఒక్కో పేజీ కేటాయించి మోసం చేయడంలో నంబర్‌వన్‌ స్థానం వచ్చింది. హామీలు నెరవేర్చమని ఆయా కులాలు అడిగితే తాట వలుస్తా అనడంలో నంబర్‌ వన్‌ స్థానం వచ్చింది. మట్టి, ఇసుక, బొగ్గు, కరెంటు కొనుగోలు, రాజధాని భూములు, చివరికి గుడి భూములు కూడా వదలిపెట్టకుండా దోచుకోవడంలో చంద్రబాబుకు నంబర్‌ వన్‌ స్థానం వచ్చింది.  దోచుకున్న అవినీతి సొమ్మునుదాచుకునేందుకు విదేశాలకు వెళ్లడంలో న ంబర్‌ వన్‌ స్థానం వచ్చింది. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రాజ్యాంగాన్ని కాపాడాలి. కానీ తన వద్ద ఉన్న నల్లధనంతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు లంచాలు ఇస్తూ ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయిన విషయంలో నంబర్‌ వన్‌ స్థానం వచ్చింది. జన్మభూమి కమిటీలను ఏరర్పాటు చేసి లంచాలు తీసుకోవడంలో నంబర్‌ వన్‌ స్థానం వచ్చింది.
– నాలుగేళ్ల చంద్రబాబు పాలనను చూశారు. చంద్రబాబు జీవితమంతా అబద్ధాలు, మోసాలు, అవినీతి తప్ప ఏమీ కనిపించదు. ఈయన సరికొత్త డ్రామా టీవీ ఆన్‌ చేయగానే కనిపిస్తుంది. నరేంద్రమోడీపై యుద్ధమంటూ కొత్త  డ్రామా కనిపిస్తుంది. కేంద్రంపై 13 సార్లు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టి పెట్టి..విసుగు చెంది రాజీనామాలు చేసి ఇంటికి వచ్చారు. నిన్న అఖిలపక్ష సమావేశంలో బుట్టారేణుకమ్మ అనే ఎంపీ వైయస్‌ఆర్‌సీపీ నుంచి టీడీపీలో చేరితే..ఆమెపై అనర్హత వేటు వేయకపోగా,ఆమెను వైయస్‌ఆర్‌సీపీ లోక్‌సభ డిప్యూటి ఫ్లోర్‌ లీడర్‌ అంటూ కూర్చి ఇచ్చి కూర్చోబెట్టారు. పైనేమో తిడుతున్నట్లు డ్రామాలు..లోపల కూర్చీలు వేసి కూర్చోబెడుతున్నారు. కేంద్ర మంత్రి నిర్మాల సీతారామన్‌ భర్త పరకాల ప్రభాకర్‌ను చంద్రబాబు ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తారు. మహారాష్ట్ర బీజేపీ మంత్రి భార్యను టీటీడీ సభ్యురాలిగా నియమిస్తారు. సీన్‌ కట్‌ చేస్తే బాలకృష్ణ సినిమా షూటింగ్‌లో వెంకయ్యనాయుడు క్లాప్‌ ఇస్తారు. ఇది చంద్రబాబు నాటకాలు. 
– ఫలాని వాడు మన నాయకుడు అని ప్రతి కార్యకర్త కాలర్‌ ఎగురవేసుకొని చెప్పుకోవాలి. కానీ చంద్రబాబు గురించి ఆ పార్టీ నాయకులే ఏం చెబుతారో తెలుసా? మా నాయకుడు అధికారం కోసం పిల్లనిచ్చిన సొంత మామ ఎన్‌టీ రామారావుకు వెన్నుపోటు పొడుస్తారు. ఎన్నికలప్పుడు ఆయన ఫోటోకు దండేస్తారు అని ఆ పార్టీ నాయకులే చెబుతారు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి. ఈ వ్యవస్థలో నిజాయితీ, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం రావాలి. ఈ వ్యవస్థను మార్చాలంటే ఒక్క వైయస్‌ జగన్‌ వల్ల సాధ్యం కాదు..జగన్‌కు మీ అందరి తోడు, ఆశీస్సులు కావాలి.
– పొరపాటున ఇటువంటి చంద్రబాబును క్షమిస్తే..రేపు పొద్దున ఇదే చంద్రబాబు ఏం చేస్తారో తెలుసా? ఇలా మైక్‌ పట్టుకొని మొట్టమొదట ఏం అంటారో తెలుసా? ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పివన్నీ 98 శాతం అమలు చేశానని చెవ్వుల్లో కాలీఫ్లవర్‌ పెడుతారు. చిన్న చిన్నవి చెబితే నమ్మరని చంద్రబాబుకు బాగా తెలుసు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటారు. కేజీ బంగారానికి బోనస్‌ అంటారు. ప్రతి ఇంటికి బెంజికారు ఇస్తామంటారు. అయినా నమ్మరని చంద్రబాబుకు తెలుసు. కాబట్టి ప్రతి ఇంటికి ఓ మనిషిని పంపిస్తారు. మహిళా సాధికార మిత్రలు వచ్చి ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల డబ్బు పెడతారు. డబ్బులు ఇస్తే మాత్రం వద్దనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే..కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనసాక్షి ప్రకారం ఓట్లు వేయమని కోరుతున్నాను. అబద్ధాలు చెప్పేవారిని, మోసం చేసే వారిని బంగాళఖాతంలో కలిపే పరిస్థితి రావాలి.
– ఇటువంటి అన్యాయమైన పాలన పోయి మనందరి ప్రభుత్వం వచ్చిన తరువాత మనం ఏం చేస్తామన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. ఆ నవరత్నాలు సవ్వ్యంగా అమలు అయ్యేందుకు కొన్ని కార్యక్రమాలు చేపడుతాం. మనందరి ప్రభుత్వం వచ్చాక మన పిల్లల చదువుల కోసం ఏం చేస్తామన్నది ఈ మీటింగ్‌లో చెబుతున్నాను. 
– రాష్ట్రాన్ని విడగొట్టేసమయంలో రాష్ట్రంలో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పారు. ఈ ఉద్యోగాలు వస్తాయని మన పిల్లలు చదువుతూనే ఉన్నాయి. చంద్రబాబు ఉన్న ఉద్యోగాలు ఎలా తొలగించాలో  అని ఆలోచిస్తున్నారు. చదువుకుంటున్న ప్రతి పిల్లాడికి చెబుతున్నాను. మనందరి ప్రభుత్వం రాగానే ఖాళీగా ఉన్న లక్ష నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని మాట ఇస్తున్నాను. నోటీఫికేషన్లు అన్నీ కూడా క్యాలెండర్‌ ముందుగా ప్రకటించి ఉద్యోగాలు కల్పిస్తాను. 
– గ్రామాల్లో పింఛన్, రేషన్‌కార్డు, మరుగుదొడ్డి కావాలన్నా లంచాలు ఇవ్వాల్సిందే. మనందరి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ వ్యవస్థను మార్చబోతున్నాం. ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్‌ తీసుకువస్తాను. మీ గ్రామానికి చెందిన పది మంది పిల్లలకు మీ గ్రామంలోనే ఉద్యోగాలు ఇస్తాం. చదువుకున్న మన పిల్లలకు మన గ్రామంలోనే ఉద్యోగాలు ఇవ్వడమే కాదు..వారి చేతుల్లో రాష్ట్ర భవిష్యత్తు పెడతాం. ఎలాంటి సంక్షేమ పథకం కావాలన్నా..ఎవరూ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. 72 గంటల్లో సంక్షేమ పథకాలు అందజేస్తాం. దాదాపు లక్ష యాభై వేల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తాం.
– పరిశ్రమలు మన ఊర్లో వస్తున్నాయంటే సంతోషపడుతాం, ఇవాళ మన ప్రాంతంలో ఉన్న పరిశ్రమల్లో వేరే రాష్ట్రాల్లో ఉన్న వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. మన పిల్లలకు వాచ్‌మెన్‌ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. రేపు పొద్దున మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చిన తరువాత మొట్ట మొదటి సభలోనే ఓ బిల్లు తీసుకువస్తాం. ఎక్కడైతే పరిశ్రమ వస్తుందో అక్కడ 75 శాతం లోకల్‌ వారికే ఇవ్వాలని చట్టం చేస్తాం. 
– ప్రత్యేక హోదా కోసం మీ అందరూ ప్రార్థనలు చేయాలి. ఏ పార్టీని కూడా మీరు నమ్మవద్దు. నమ్మి అలసిపోయారు. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అన్యాయంగా రాష్ట్రాన్ని విడగొట్టింది. రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో మనకు ఇ వ్వాల్సిన అంశాలను చట్టంలో పెట్టకుండా చూద్దాం..చూద్దామని మోసం చేసింది. ఇవాళ ఎన్నికలు దగ్గరికి వచ్చే సరికి ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతోంది. నమ్మవద్దు. బీజేపీని కూడా చూడండి. ఇదే బీజేపీ ఆ రోజు ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని మాట ఇచ్చారు. ఎన్నికల ప్రణాళికలో పెట్టారు. నరేంద్రమోడీ తిరుపతి సభలో హామీ ఇచ్చారు. ఇచ్చే స్థానంలో ఉండి కూడా మోసం చేస్తోంది. చంద్రబాబు మళ్లీ ప్రజలవద్దకు వచ్చి తనకు 25 ఎంపీ సీట్లు ఇవ్వమని అడుగుతున్నారు. 20 మంది ఎంపీలు ఉన్న చంద్రబాబు ఏం ఒరగబెట్టారని ప్రశ్నించండి. నాలుగేళ్లు ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీని స్వాగతించి..ఇప్పుడు హోదా కావాలని డ్రామాలాడుతున్నారు. ఏ ఒక్క పార్టీని నమ్మకండి..ప్రతి ఒక్కరి ఓటు వైయస్‌ఆర్‌సీపీకే వేయమని కోరుతున్నాను. ఆ తరువాత కేంద్రంలో ఎవరు ఉన్నా మనం శాసిద్దాం. 25 ఎంపీ స్థానాలు వైయస్‌ఆర్‌సీపీకి ఇవ్వండి..ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాం. ప్రత్యేక హోదా ఉంటే ఇన్‌కం ట్యాక్స్‌ కట్టాల్సిన పని లేదు. జీఎస్టీ కట్టాల్సిన పని లేదు. అప్పుడే ఎవరైనా ముందుకు వచ్చి ఫ్యాక్టరీలు పెడతారు. ప్రత్యేక హోదా కోసం మీ అందరూ చల్లని దీవెనలతో ఆశీర్వదించమని కోరుతున్నా..చెడిపోయిన ఈ వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డకు తోడుగా ఉండమని పేరు పేరున కోరుతూ సెలవుతీసుకుంటున్నా.. 
Back to Top