వర్ష ప్రభావంపై వైఎస్ జగన్ ఆరా

జిల్లా నేతలతో మాట్లాడిన జగన్
రాయలసీమ
జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాల్లో భారీ వర్షాలు
కురుస్తున్నాయి. ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
 వర్షాలకు సంబంధించి ఆయా జిల్లా నేతలకు ఫోన్ చేసి ఆరా తీశారు. వైఎస్ జగన్
ఆదేశాల మేరకు నేతలు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితిని
సమీక్షిస్తున్నారు. 

కుండపోత వర్షాలతో పలు
ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ
వరప్రసాద్ అన్నారు. తక్షణమే బాధితులకు ఆహారపదార్థాలు అందించడంతో పాటు
మందులు సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారీ వర్షాల కారణంగా
కొన్ని గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయని, బాధితప్రాంత ప్రజలకు న్యాయం
చేయాలని కలెక్టర్ ను కోరినట్లు వరప్రసాద్ చెప్పారు.

చిత్తూరులోని
 కోట, వాకాడు, చిట్టమూరు తదితర ప్రాంతాలను వరద ముంచెత్తిందన్నారు. రైతులు,
పేదలు, ముఖ్యంగా గుడెసెల్లో ఉన్న వారందరికీ సహకరించి అత్యవసర సేవలు
అందించాలని అధికారులను ఆదేశించామన్నారు. 
Back to Top