గిరిజ‌నుల‌ను ఆదుకోవాలి :వైఎస్ జ‌గ‌న్‌

గిరిజ‌నుల‌కు అధికంగా విద్యుత్ ఛార్జీలు విధించ‌టంపై ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైఎస్సార్సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అధిక బిల్లుల‌పై ఆయ‌న ఆందోళ‌న వ్యక్తం చేశారు. వెంట‌నే గిరిజ‌నుల విద్యుత్ బిల్లుల్ని ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు.  వైఎస్ఆర్ జిల్లా వేముల మండలం కనుంపల్లి గ్రామవాసులు సోమవారం వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ను కలిశారు. గిరిజనులైన తమకు వేలల్లో కరెంటు బిల్లులు వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వైఎస్ జగన్ మాట్లాడుతూ.. గిరిజనులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇవ్వాల్సింది పోయి వేల రూపాయల్లో బిల్లులు చెల్లించాలంటే వారు ఎలా జీవిస్తారని ప్రశ్నించారు. అధిక విద్యుత్ బిల్లులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వెంటనే విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Back to Top