టీడీపీయే అసలు సిసలైన ‘తెలుగు కాంగ్రెస్'

హైదరాబాద్: శాసనసభలో టీడీపీ సభ్యుల వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నిప్పులు చెరిగారు. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై అభాండాలు వేయడం తగదని హితవు పలికారు. మహానాయకుడు, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనకు, టీడీపీ ప్రభుత్వానికి పోలికా? అని ఎద్దేవా చేశారు. తమ పార్టీపై అవాకులు చవాకులు పేలడం మానాలన్నారు. తాము దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వారసులమే తప్ప కాంగ్రెస్‌కు కాదని తేల్చిచెప్పారు. టీడీపీయే అసలు సిసలైన ‘తెలుగు కాంగ్రెస్’ అని అభివర్ణించారు.
Back to Top