- తెలుగు రాష్ట్రాల్లో వైయస్ జగన్ పుట్టినరోజు కార్యక్రమాలు- కేక్‌లు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు- పార్టీ కేంద్ర కార్యాలయంలో రక్తదాన శిబిరం- అన్ని జిల్లాల్లో సేవా కార్యక్రమాలుఅమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాలతో పాటు, వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, మహ్మద్ ఇక్బాల్ తదితరులు భారీ కేక్ కట్ చేసి వైయస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా పలువురు యువకులు రక్తం దానం చేశారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. అలాగే విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పార్టీ సీనియర్ నాయకులు పార్థసారధి, లక్ష్మీపార్వతి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, గౌతంరెడ్డి, సినీ నటుడు ప్వధ్వీ తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడలో నిర్వహించిన వేడుకల్లో పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ పాల్గొని కేక్ కట్ చేశారు. గుంటూరులో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా పలు సేవా కార్యక‍్రమాలు చేపట్టారు. సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదానం చేయడంతో పాటుగా, పళ్లు, మందులు, దుస్తులను పంపిణీ చేశారు. దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. అలాగే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఫ్రీ మెడికల్ క్యాంప్‌కు సైతం ఎత్తున స్థానిక ప్రజలు హాజరై వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకున్నారు.