విశాఖ‌లో వివాహానికి హాజ‌రైన వైయ‌స్ జ‌గ‌న్‌

విశాఖ: ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్య‌క్షులు  వైఎస్ జగన్  విశాఖ‌లో ప‌ర్య‌టించారు.  మాజీమంత్రి బలిరెడ్డి సత్యారావు మనమరాలు బిందు మౌనిక వివాహానికి విచ్చేశారు. నగరంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ హాల్లో బిందు మౌనిక వివాహం జరిగింది. ఈ వేడుకకు హాజరైన వైఎస్ జగన్ నూతన వధూవరులు బిందు మౌనిక-గిరిధర్లను ఆశీర్వదించారు. అనంతరం వైఎస్ జగన్ సర్క్యూట్ హౌస్లో పార్టీ సమన్వయకర్తలతో సమావేశం అయ్యారు. గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమంతో పాటు, పలు అంశాలపై చర్చించారు. అనంత‌రం తిరిగి హైద‌రాబాద్ కు బ‌య‌లు దేరారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top