హోదాను సాధించేందుకు యువత తరలిరావాలి

మేడికొండూరుః గుంటూరులో వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి చేపడుతున్న ‘యువభేరి’ కార్యక్రమానికి మండలం నుంచి వేలాది మంది యువత పాల్గొని విజయవంతం చేయాలని వైయస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీసెల్‌ కార్యదర్శి తమనంపల్లి శాంతయ్య పిలుపునిచ్చారు. మండల పరిధిలోని పేరేచర్ల జంక్షన్‌లో బుధవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని అన్నారు.  రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోరుతూ జగనన్న చేపడుతున్న యువభేరి సదస్సులో ప్రతి ఒక్క విద్యార్థి పాల్గొని విజయవంత చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడం వల్లన ఆంధ్రలో ప్రముఖ సంస్థలు కొలువుతీరి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర్ర రైతు విభాగ కార్యదర్శి తిప్పరెడ్డి రామకృష్ణారెడ్డి, పేరేచర్ల ఎంపీటీసీ షేక్‌ గండికోట రసూల్, వైయస్సార్‌సీపీ ప్రచార కమిటి కార్యదర్శి కోకా అర్జున్‌రావు, షేక్‌ అబ్బాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Back to Top