ఎవరినడిగి విభజన నిర్ణయం చేశారు?

హైదరాబాద్, 26 అక్టోబర్ 2013:

ఎవరినడిగి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలని నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు డిమాండ్ చేశారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని వెనక్కి తీసుకునేది లేదంటున్న కాంగ్రె‌స్ అధిష్టానం పెద్దలు ఎవరి కోసం విభజన చేశారని ఆయన నిలదీశారు. ఎవరి కోసం విభజన నిర్ణయాన్ని తీసుకున్నారో చెప్పాలని జూపూడి ప్రశ్నించారు. ప్రజల నిర్ణయంతో సంబంధం లేకుండా విభజన నిర్ణయం తీసుకుంటే వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఒప్పుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు.

‌మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజలకు ఆయన మరణం తర్వాత ప్రభుత్వంపై నమ్మకం పోయిందన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కుతోనే విభజన కుట్ర జరిగిందని జూపూడి ఆరోపించారు. తుపాన్, భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా వచ్చినవారిని జూపూడి స్వాగతించారు. సిక్కోలు నుంచి చిత్తూరు వరకూ తరలి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. శ్రీ జగన్ వెంట నడుస్తున్న సైన్యం తుపానులో ఢిల్లీ నాయకులు కొట్టుకుపోవాలని ఆయన అన్నారు.

Back to Top