మా పోరాటం కొనసాగుతుంది

ఏపీ అసెంబ్లీ: పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీపై మా పోరాటం కొనసాగుతుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. మీడియా పాయింట్లో ఆమె మాట్లాడుతూ.. ప్రశ్నా పత్రాల లీకేజీపై మూడు రోజులుగా ఆందోళన చేపడుతున్నా..ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకు ప్రతిపక్ష నేతకు మైక్‌ ఇవ్వడం లేదని విమర్శించారు. మంత్రులు తప్పులు చేశారు కాబట్టే తప్పించుకుంటున్నారని ధ్వజమెత్తారు. మేం సభలో లేనప్పుడు ప్రకటనలు చేస్తున్నారని, ఇప్పుడేందుకు చర్చకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. లీకేజీపై  సీబీఐ విచారణ జరగాల్సిందే అని ఆమె పట్టుబట్టారు.

Back to Top